ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‍అరుదైన ఘనత | Allu Arjun Gets Honour of His Image on Forbes Magazine Page | Sakshi
Sakshi News home page

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‍అరుదైన ఘనత

Aug 27 2026 5:01 PM | Updated on Aug 27 2026 5:13 PM

Allu Arjun Gets Honour of His Image on Forbes Magazine Page

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. ప్రముఖ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ పోర్బ్స్ కవర్‌ పేజీపై ఆయన కనిపించారు.  వివిధ రంగాల్లో రాణించిన 100 మంది తారల జాబితాను షో స్టాపర్స్ -2026 పేరుతో ఫోర్బ్స్ ఇండియా తాజాగా విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో బన్నీ కూడా స్థానం దక్కించుకున్నారు. ఇందులో అల్లు అర్జున్‌తో పాటు రామ్‌ చరణ్‌, అమితాబ్‌ బచ్చన్‌, మోహన్‌ లాల్‌, రజనీకాంత్‌, షారుక్‌ ఖాన్‌, ఆమిర్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్, ఏఆర్‌ రెహమాన్, బాబీ డియోల్, దుల్కర్‌ సల్మాన్‌, మాధవన్‌, రణ్‌వీర్‌ సింగ్‌, రిషబ్‌ శెట్టి, కల్యాణి ప్రియదర్శన్‌, కంగనా రనౌత్‌ కూడా ఉన్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే అల్లు అర్జున్‌ ప్రస్తుతం రాకా మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మువీ షూటింగ్ ముంబయిలో జరుగుతోంది. ఈ చిత్రంలో బన్నీ సరసన బాలీవుడ్ భామ దీపికా పదుకొణె హీరోయిన్‌గా కనిపించనుంది. అంతేకాకుండా మృణాల్‌ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మికా మందన్నా నటిస్తున్నారనే టాక్‌ వినిపిస్తోంది. ఈ చిత్రంలో బన్నీ ట్రిపుల్ రోల్ చేస్తున్నారని మరో టాక్. ఈ చిత్రంలో కోలీవుడ్ భామ ఐశ్వర్య లక్ష్మీ సైతం కనిపించనుందని లేటేస్ట్ బజ్. ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement