ఇరుముడితో ఏం చెప్పాలనుకున్నారు?.. డైరెక్టర్‌కు సూటి ప్రశ్న | A doctor Questioned Ravi teja Irumudi Director about Message | Sakshi
Sakshi News home page

Irumudi Movie: ఇరుముడిలో అన్ని తప్పులెందుకు?.. డైరెక్టర్‌ ఏం మెసేజ్ ఇస్తున్నారు?

Aug 27 2026 2:41 PM | Updated on Aug 27 2026 2:52 PM

A doctor Questioned Ravi teja Irumudi Director about Message

ప్రస్తుతం టాలీవుడ్‌ అంతా ఒకటే పేరు వినిపిస్తోంది. అందరూ ఆ మూవీ గురించే చర్చించుకుంటున్నారు. యశ్ టాక్సిక్‌ రిలీజైనా కూడా ఇరుముడి గురించే ఆడియన్స్‌ ఆరా తీస్తున్నారు. అంతలా ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. ఓ కూతురి తండ్రి ఎలా పెంచాలనే కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కించారని అంటున్నారు. ఈ మూవీ రిలీజైన రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే వంద కోట్ల మార్క్‌ను సైతం దాటేసింది.

అయితే ఒక సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిందంటే చాలు ఆడియన్స్‌ క్యూ కడతారు. అందులోని మైనస్‌ల గురించి పెద్దగా పట్టించుకోరు. అయితే ఇరుముడికి పాజిటివ్‌ రెస్పాన్స్ రావడంతో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నప్పటికీ అవీ పెద్దగా హైలెట్ కాలేదు. కానీ ఈ మూవీ సమాజానికి సందేశం ఇచ్చేలా ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో జాగ్రత్తలు అవసరమని అంటున్నారు ఓ ప్రముఖ వైద్యుడు ఉప్పలపాటి రామ్ వర్మ. ఇరుముడి డైరెక్టర్‌ తీరును ఆయన తప్పుబడుతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేశారు.

డాక్టర్ తన ట్వీట్‌లో రాస్తూ..'ఈ సినిమాలో నాకో పెద్ద డౌట్ ఏంటంటే... సినిమా ప్రారంభంలో బయట ఏం జరిగినా కూతురు తండ్రికి చెప్పాలి.. అలాగే ఆడపిల్ల భయంతో కాదు ధైర్యంగా బతకాలి అనేదే కదా కన్సెప్ట్.. మరి తండ్రికి అన్ని విషయాలు చెప్పాలనుకునే కూతురును డైరెక్టర్ ఎందుకు చంపేసాడు.. మరో పక్క సాయికుమార్ ఆడపిల్ల భయంతోనే పెరగాలి అదే శ్రీరామ రక్ష అంటాడు.. ఒకపక్క ధైర్యంగా మాట్లాడాలి అనే ఆడపిల్లను చంపేసి.. మరోపక్క భయంతో నిజాలను దాచేసి తన జీవితాన్ని ఓ ఎమ్మెల్యే చేతిలో నాశనం చేసుకొన్న మరో ఆడపిల్ల' అంటూ రాసుకొచ్చారు.

అసలు ఇరుముడి మూవీతో డైరెక్టర్ ఏం చెప్పదలుచుకున్నాడు?  ఈ సినిమా చూసిన పిల్లలు రియల్ లైఫ్‌లో నిజం మాట్లాడినా.. బయటకు చెప్పినా చంపేస్తారేమోనన్న భయం, అనుమానం కలగదా..? ఇద్దరు ఆడపిల్లల జీవితాలను విచ్ఛిన్నం చేసి ఏం మెసేజ్ ఇద్దామనుకున్నాడు ఈ డైరెక్టర్..? ధైర్యంగా ఉండే ఆడపిల్ల చనిపోకుండా ఉండింటే చాలా మందికి ధైర్యాన్ని ఇచ్చిన వాళ్లుగా ఉండేది కదా.. ఇదంతా సినిమా... సినిమాను సినిమాలా చూడాలని నీతులు చెప్పకండి అంటారు.. కానీ సినిమాలు సమాజం మీద ప్రభావం చూపుతాయి కదా? అని పోస్ట్ చేశారు. మరి దీనిపై దర్శకుడు శివ నిర్వాణ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement