నిన్న రామ్‌చరణ్‌...నేడు చిరంజీవి... ‘ఇరుముడి’పై ‘మెగా’ ప్రశంసలు | Chiranjeevi Review On Irumudi Movie | Sakshi
Sakshi News home page

‘ఇరుముడి’పై చిరంజీవి రివ్యూ.. వెంటనే స్పందించిన రవితేజ!

Aug 27 2026 2:31 PM | Updated on Aug 27 2026 3:01 PM

Chiranjeevi Review On Irumudi Movie

ఇరుముడి.. ఇప్పుడు టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ నడుస్తోంది. సాధారణ ప్రేక్షకులే కాదు సినీ తారలు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై రష్మిక, విజయ్‌ దేవరకొండ, రామ్‌ చరణ్‌ లాంటి స్టార్స్‌ ఎక్స్‌ వేదికగా తమ రివ్యూని ఇచ్చారు. ఇక తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు పూర్తిగా ఆస్వాదించానన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో సుధీర్ఘమైన పోస్ట్‌ పెట్టాడు. 

(చదవండి: 'ఇరుముడి' సక్సెస్.. చరణ్ ప్రశంసలు)

‘ఇరుముడి’తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టిన నా ప్రియ సోదరుడు రవితేజకి హృదయపూర్వక అభినందనలు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు పూర్తిగా ఆస్వాదించాను. రవితేజ చాలా అద్భుతంగా నటించాడు. త్రినాథ్‌ పాత్రను తన భుజాలపై మోశాడు. దర్శకుడు శివనిర్వాణ ఈ సినిమాను భావోద్వేగంతో చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. బేబీ నక్షత్ర(ఈ చిత్రంలో రవితేజ కూతురుగా నటించింది)కు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆశీస్సులు. చిత్ర బృందానికి, నిర్మాతలకు, నవీన్ యెర్నేని, ఇతరులకు నా హృదయపూర్వక అభినందనలు. ఒక సినిమా విజయం పరిశ్రమలోని అందరికీ పండుగే. ఈ పరిశ్రమ అందరిదీ… ఏ కొందరిదో కాదు. మనం బతకాలి… ఇతరులనూ బతికించాలి’అని చిరంజీవి తన ఎక్స్‌ ఖాతాలో రాసుకొచ్చారు. ఇక చిరంజీవి ట్వీట్‌పై రవితేజ కూడా స్పందిస్తూ.. ‘అన్నయ్య..థ్యాంక్యూ సో మచ్‌’ అని రీట్వీట్‌ చేశాడు. 

(చదవండి: ‘ఇరుముడి’కి ఈ పాప రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా..!)

ఇరుముడి విషయానికొస్తే.. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించింది. రవితేజకు జోడీగా ప్రియా భవానీ శంకర్‌ నటించగా, బేబీ నక్షత్ర, సాయి కుమార్‌ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 21న విడుదలైన ఈ చిత్రం కేవలం రెండు రోజుల్లోనే బ్రేక్‌ ఈవెన్‌ సాధించింది. ఐదు రోజుల్లోనే రూ.108.5 కోట్ల గ్రాస్‌ వసూళ్లను సాధించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement