కోట్లు సంపాదించా.. ఇప్పుడు ఫలితం లేదు: షకీలా | There Is No Money Left: Shakeela Recalls 4 Crore Earnings | Sakshi
Sakshi News home page

కోట్లు సంపాదించా.. ఇప్పుడు ఫలితం లేదు: షకీలా

Aug 27 2026 1:46 PM | Updated on Aug 27 2026 2:22 PM

There Is No Money Left: Shakeela Recalls 4 Crore Earnings

షకీలా పేరు తెలియని వారు ఉండరు. ఎందుకంటే ఒకప్పుడు చిత్రసీమలో ఆమెకు ఉండే క్రేజ్‌ అలాంటిది. నిజానికి ఈమె మలయాళి యాక్టర్‌ అయినా.. సీమశాస్త్రీ, అల్లరి పిడుగు, కొబ్బరిమట్ట వంటి చిత్రాల్లో నటించడంతో తెలుగు ప్రేక్షకులకూ మరింత దగ్గరయ్యారు. ఒకప్పుడు మలయాళ చిత్రసీమలో భారీ క్రేజ్‌ సంపాదించిన ఆమె.. తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

బాధగా ఉంది..
‘నేను ఎప్పుడు తప్పు చేయలేదు. కానీ బాధ పడుతున్నాను. నా సినిమాలు చూడమని ఎవరినీ బ్రతిమలాడలేదు. ఎవరి జీవితాన్ని నాశనం చేయలేదు. నా చుట్టూ ఉన్నవాళ్లు నన్ను కాకుండా నా డబ్బునే కోరుకున్నారు. దాదాపు రూ.4 కోట్లు సంపాదించా. అయితే ఆ డబ్బు ఇప్పుడు నా దగ్గర లేదు. పెద్ద అక్క దగ్గర భద్రంగా ఉంది. దాంతో ఆమె చాలా మంచిగా సెటిల్‌ అయ్యారు’అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

ఆమె రాకపోవడమే మంచిది..
మీకు నమ్మించి మోసం చేసిన వారు ఎవరైనా ఉన్నారా అని ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు బదులు ఇస్తూ..‘నా పెద్దక్క నన్ను చూసి చాలా ఏళ్లు అయింది. ఆమె నా దగ్గరకి రావడం లేదని చాలా బాధపడేదాన్ని కానీ ఇప్పుడు రాకపోతేనే మంచిది అనిపిస్తోంది. ఎందుకంటే ఆమెకి ఇవ్వడానికి నా దగ్గర ఇప్పుడు డబ్బులేదు’ అని షకీలా చెప్పుకొచ్చారు. తన కెరీర్‌ను కొందరు స్టార్‌ హీరోలు నాశనం చేశారన్న ప్రచారాన్ని కూడా ఆమె ఖండించారు. 
ఐపీఎస్‌ అవుతా..
తన జీవితాన్ని మరోసారి ప్రారంభించే అవకాశం వస్తే చిన్నప్పటి నుంచి కష్టపడి చదివి ఐపీఎస్‌ కావాలని కోరుకుంటానని షకీలా తెలిపారు. చిన్నప్పుడు పాఠశాలకు వెళ్లడం తనకు నచ్చేది కాదని ఉపాధ్యాయులు కొట్టడంతో చదువుపై ఆసక్తి పోయిందని చెప్పారు.

ఇటీవలే ఆసుపత్రిలో..
కాగా ఇటీవలే మెడ నొప్పికారణంగా ఆసుపత్రిలో చేరారు. అతిగా ఫోన్‌ ఉపయోగించడం కారణంగా తాను తీవ్రమైన మెడ నొప్పితో బాధపడ్డానని షకీలా తెలిపారు. పరిస్థితి మరింత తీవ్రమవడంతో చివరకు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఇందుకోసం సుమారు రూ.3 లక్షలు ఖర్చయినట్లు ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా మొబైల్‌ వినియోగాన్ని తగ్గించాలని అభిమానులకు సూచించారు.

ఇదీ చదవండి: పెళ్లి తర్వాత తొలి చిత్రం.. అప్‌డేట్‌ వచ్చేసింది..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement