LCUని పక్కన పెట్టి.. అల్లు అర్జున్‌తో లోకేష్ ప్రయోగం ఎందుకు? | Why Lokesh Kanagaraj experimented with Allu Arjun | Sakshi
Sakshi News home page

LCUని పక్కన పెట్టి.. అల్లు అర్జున్‌తో లోకేష్ ప్రయోగం ఎందుకు?

Aug 26 2026 11:35 PM | Updated on Aug 27 2026 5:58 AM

Why Lokesh Kanagaraj experimented with Allu Arjun

లోకేష్ కనగరాజ్ పేరు వినగానే LCU గుర్తుకు వస్తుంది. ఈ దర్శకుడు తీసిన ఖైదీ 2, విక్రమ్ 2, రోలెక్స్ వంటి సినిమాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి సమయంలో ఆయన ఆ సినిమాలను పక్కన పెట్టి మరీ ముందుగా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌తో సినిమా చేయడం ఆసక్తికరంగా మారింది. దానికి కారణం.. దాదాపు ఆరేళ్ల క్రితమే మైత్రీ మూవీ మేకర్స్ లోకేష్‌కు అడ్వాన్స్ ఇచ్చిందట. మరోవైపు అల్లు అర్జున్‌తో సినిమా చేయాలనే ఆలోచన కూడా కొంతకాలంగా ఉందని లోకేష్ ఓ సందర్భంలో వెల్లడించాడు. ఈ రెండు కమిట్‌మెంట్లు ఇప్పుడు కలవడంతో AA23 పట్టాలెక్కింది.

ఇక ఖైదీ 2 ఆలస్యానికి ఆ సినిమా హీరో కార్తి షెడ్యూల్స్ కూడా కారణమయ్యాయి. రజినీకాంత్–కమల్ హాసన్ కాంబినేషన్ కోసం లోకేష్ కొంతకాలం పనిచేశారు. కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ కుదరలేదు. అదే సమయానికి కార్తి కూడా మరో సినిమాకు డేట్స్ ఇచ్చేశాడు. దీంతో లోకేష్‌కు వచ్చిన గ్యాప్‌లో అల్లు అర్జున్ ప్రాజెక్ట్ ముందుకు వచ్చింది. మైత్రీ నిర్మిస్తున్న AA23 సినిమాని పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే వచ్చిన అనౌన్స్‌మెంట్ వీడియోలో అడవి, గుర్రం, జంతువుల నేపథ్యంలో ఆసక్తికరమైన ప్రపంచాన్ని హింట్ చేశారు. అయితే ఆ సినిమా కథపై మాత్రం ఎలాంటి ఇంకా క్లారిటీ లేదు.

LCUతో కనెక్షన్లు లేకుండా లోకేష్ చేస్తున్న ఈ కొత్త ప్రయోగం ఎలా ఉండబోతుందన్నదే ఇప్పుడు ఆసక్తికరం. అల్లు అర్జున్ సినిమా తర్వాత తన తదుపరి సినిమా ఖైదీ 2నే అని లోకేష్ ఇప్పటికే స్పష్టం చేశాడు. అంటే ఇది LCUకి బ్రేక్ మాత్రమే.. ముగింపు కాదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement