టాక్సిక్‌ ఫస్ట్‌డే కలెక్షన్స్‌ : డివైడ్‌ టాక్‌.. అయినా దుమ్ములేపింది! | Toxic Movie Box Office Collection Day 1 Details | Sakshi
Sakshi News home page

టాక్సిక్‌ ఫస్ట్‌డే కలెక్షన్స్‌ : డివైడ్‌ టాక్‌.. అయినా దుమ్ములేపింది!

Aug 27 2026 12:35 PM | Updated on Aug 27 2026 1:52 PM

Toxic Movie Box Office Collection Day 1 Details

‘స్టార్’ పవర్ ఉంటే నెగెటివ్ టాక్ కూడా ‘నీటిమీద రాతే’ అని టాక్సిక్‌ మూవీ వసూళ్లు నిరూపించాయి. రాకింగ్‌ స్టార్‌ యశ్‌ హీరోగా గీతూ మోహన్‌ దాస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిన్న(ఆగస్టు 27) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. తెలుగు ప్రేక్షకులు అయితే చాలా వరకు నెగెటివ్‌ రివ్యూస్‌ ఇచ్చారు. ఆశించిన స్థాయిలో సినిమా లేదని చాలా మంది సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. పలు న్యూస్‌ వెబ్‌సైట్లు కూడా ఈ సినిమాపై నెగెటివ్‌ రివ్యూనే ఇచ్చాయి. 

(చదవండి: టాక్సిక్‌ మూవీ రివ్యూ)

అయితే ఈవేవి ‘టాక్సిక్‌’ కలెక్షన్స్‌కు అడ్డుగా మారలేదు. తొలి రోజు రికార్డు స్థాయిలో వసూళ్లను సాధించింది రాకింగ్‌ స్టార్‌ పవర్‌ ఏంటో మరోసారి ఇండియన్‌ బాక్సాఫీస్‌కు చూపించింది. సినీ వర్గాల సమాచారం ప్రకారం తొలి రోజు ఈ చిత్రానికి ఇండియాలో రూ. 120 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది.

 ప్రపంచవ్యాప్తంగా రూ.140 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిందని చెబుతున్నారు. హిందీ వెర్షన్ అత్యధికంగా రూ. 55 కోట్లు వసూలు చేయగా.. తెలుగులో రూ. 16 కోట్లు వచ్చినట్లు నివేదికలు పేర్కొన్నాయి. కన్నడలో రూ. 23.3 కోట్లు, తమిళంలో రూ. 5.5 కోట్లు, మలయాళంలో రూ. 1.3 కోట్లు కలెక్ట్ చేసినట్లు వెల్లడించారు. అయితే ఫస్ట్‌డే కలెక్షన్స్‌ వివరాలను మేకర్స్‌ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement