రాసింది ఒకటి.. తీసింది మరోకొటి.. ‘టాక్సిక్‌’ దర్శకురాలి వ్యాఖ్యలు వైరల్‌ | Toxic Movie Director Geetu Mohandas Old Comments Goes Viral | Sakshi
Sakshi News home page

రాసింది ఒకటి.. తీసింది మరోకొటి.. ‘టాక్సిక్‌’ దర్శకురాలి వ్యాఖ్యలు వైరల్‌

Aug 27 2026 6:15 PM | Updated on Aug 27 2026 6:20 PM

Toxic Movie Director Geetu Mohandas Old Comments Goes Viral

గెలుపుకి కారణాలు వెతుకుతారో లేదో కానీ ఓటమికి మాత్రం కచ్చితంగా నిందితులను వెతుకుతారు. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో ఇది ఎక్కువగా ఉంటుంది. ఒక సినిమా ఫ్లాప్‌ అయితే.. ఆ నింద హీరో కంటే ఎక్కువగా  దర్శకుడిపైనే పడుతుంది. ‘టాక్సిక్‌’విషయంలోనూ అదే జరిగింది. యశ్‌ హీరోగా గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిన్న(ఆగస్టు 26) ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్‌డ్‌ టాక్‌ని సంపాదించుకుంది.

యశ్‌ స్క్రీన్‌ ప్రెజెన్స్‌, యాక్షన్‌ సన్నివేశాలు, విజువల్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ను పలువురు ప్రేక్షకులు ప్రశంసిస్తున్నా..  కథ, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్‌, నెమ్మదైన నేరేషన్‌, ఎమోషనల్‌ కనెక్ట్‌ విషయంలో మాత్రం  తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌ గతంలో చెప్పిన ఓ మాటలకు సంబంధించిన పాత వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

తను సినిమా తీసిన విధానం గురించి మాట్లాడుతూ.. ‘నేను రాసింది ఒకటి. తీసింది మరొకటి. ఎడిటింగ్‌ చేసింది ఇంకొకటి. మొత్తానికి సినిమా బయటకు వచ్చింది. నేను చాలా హ్యాపీ’ అని గీతూ చెప్పినట్లు ఆ వీడియోలో ఉంది. సినిమా తెరకెక్కించే క్రమంలో స్క్రిప్ట్‌ రాసిన విధానం, షూటింగ్‌లో వచ్చిన మార్పులు, చివరగా ఎడిటింగ్‌లో రూపుదిద్దుకున్న సినిమా ఒకేలా ఉండకపోవచ్చని ఆమె వ్యాఖ్యల ఉద్దేశంగా కనిపిస్తోంది. ‘టాక్సిక్‌’ విడుదలై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తున్న వేళ ఈ పాత వ్యాఖ్యలు మళ్లీ చర్చలోకి వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement