శివ కుమార్,శ్వేతా లక్ష్మణ్ జంటగా వస్తోన్న చిత్రం సహ. ఈ సినిమాకు నిశాంత్ దోటి దర్శకత్వం వహించారు. ఈ మూవీని రొమాంటిక్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చేనెల 4వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటివరకు రిలీజైన గ్లింప్స్, పాటలు సినిమాపై ఆసక్తి పెంచేస్తున్నాయి.
తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా హీరో, హీరోయిన్ మూవీ గురించి ఫుల్ అగ్రెసివ్‌గా మాట్లాడారు. ఈ మూవీ కంటెంట్ అద్భుతంగా ఉందని అన్నారు. సెప్టెంబర్ 4న రిలీజయ్యే ఈ సినిమా మీకు నచ్చకపోతే అమీర్‌పేట్ సెంటర్‌లో గుండు గీయించుకుంటానని హీరోయిన్ శ్వేతా ఛాలెంజ్ విసిరారు. ఈ మూవీ చూసి ఎవరు కూడా నిరాశకు గురికారని వెల్లడించింది. మీ అందరూ థియేటర్స్‌కు వచ్చి మా సినిమా చూడాలని కోరారు.
అదేవిధంగా హీరో శివకుమార్ సైతం ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ మూవీ మీరు ఆశించినదాని కంటే ఎక్కువగా ఉంటుందని అన్నారు. ఈ సినిమా మీకు నచ్చకపోతే నా నంబర్‌కు ఫోన్ చేసి బూతులు తిట్టండని హీరో సవాల్ చేశారు. ఈ మూవీ కంటెంట్ మీకు నచ్చితే ఒకరికి బాగుందని చెప్పండి చాలు అంటూ రిక్వెస్ట్ చేశారు. మా సినిమాకు ఎక్కువ థియేటర్స్ ఇప్పించాలని నిర్మాత బన్నీ వాసును కోరారు. మొత్తానికి సహా మూవీ థియేటర్లలో రిలీజైన తర్వాత వీళ్లిద్దరి ఛాలెంజ్‌పై ఓ క్లారిటీ రానుంది. ఈ ఈవెంట్‌కు నిర్మాత బన్నీవాసు కూడా హాజరయ్యారు.
ఈ సినిమా మీకు నచ్చకపోతే అమీర్ పేట్ సెంటర్ లో గుండు గీయించుకుంటా.
- Actress #Swetha#Sahaa #Tollywood #TeluguCinema #Tupaki
Follow 👉 @tupaki_official pic.twitter.com/IG9o8AUWyb— Tupaki (@tupaki_official) August 27, 2026


