రంభ ఊర్వశి మేనక.. ముగ్గురు భామలతో టైటిల్ సాంగ్ | Allari Naresh Latest Movie Ramba Oorvasi Menaka Title Song out now | Sakshi
Sakshi News home page

Ramba Oorvasi Menaka Title Song: 'రంభ ఊర్వశి మేనక... స్టెప్ వేస్తే తెల్లార్లూ వేడుక'

Aug 27 2026 5:31 PM | Updated on Aug 27 2026 5:48 PM

Allari Naresh Latest Movie Ramba Oorvasi Menaka Title Song out now

అల్లరి నరేష్‌ హీరోగా వస్తోన్న లేటేస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ రంభ ఊర్వశి మేనక. ఈ సినిమాకు చంద్రమోహన్‌ చింతాడ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం సెప్టెంబర్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్‌– హాస్య మూవీస్‌ బ్యానర్స్‌పై రాజేష్‌ దండా, నిమ్మకాయల ప్రసాద్‌ నిర్మించారు.

ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఫుల్ ఫన్‌గా అనిపించింది.  తాజాగా ఈ మూవీ నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్‌ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్‌ చూస్తుంటే ఈ మూవీలో హైలెట్‌గా ఉండనుందని తెలుస్తోంది. భారీస్థాయిలో ఈ పాటను షూట్‌ చేసినట్లు కనిపిస్తోంది. ఈ పాటకు సురేశ్ బనిశెట్టి లిరిక్స్ అందించగా.. ధనుంజయ్ సీపన, సాహితి చాగంటి ఆలపించారు. ఈ పాటను చైతన్ భరద్వాజ్ కంపోజ్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం ఈ టైటిల్ సాంగ్ మీరు కూడా చూసేయండి. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement