breaking news
Ajay Ghosh
-
ఇరుముడి క్రేజ్.. సొంత ఊరిలో వీక్షించిన నటుడు
టాలీవుడ్లో ఇప్పుడంతా ఇరుముడి మానియా నడుస్తోంది. రవితేజ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. ఇప్పటికే వందకోట్లకు పైగా వసూళ్లు సాధించింది. రిలీజైన ఐదు రోజుల్లోనే ఈ ఘనత సొంతం చేసుకుంది. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించగా.. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నిర్మించారు.భారీ బడ్జెట్ మూవీ టాక్సిక్ రిలీజైనప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ ఇరుముడి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. మౌత్ టాక్‌తో ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరుముడి నటుడు అజయ్ ఘోష్ సైతం ఈ చిత్రాన్ని వీక్షించాడు. తన సొంత ఊరు వేటపాలంలోని థియేటర్‌కు వెళ్లిన సామాన్య ప్రేక్షకుడిలా టికెట్ తీసుకుని మూవీని చూశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. తన సొంత ఊరు వేటపాలం థియేటర్లో లైన్లో నిల్చొని టికెట్ తీసుకుని #Irumudi సినిమా చూసిన నటుడు Ajay Ghosh. ❤️ pic.twitter.com/LeqCajihvC— cinee worldd (@Cinee_Worldd) August 27, 2026 -
‘ఇరుముడి’ వేడుకలో బూతు పదాలు.. రవితేజపై నెటిజన్స్ ఫైర్!
ఈ మధ్య సినిమా ఈవెంట్స్‌లో నటీనటులు బూతు పదాలు మాట్లాడటం కామన్‌గా మారిపోయింది. స్టేజ్‌పై మాట్లాడుతున్నామనే విషయం మర్చిపోయి.. ఫ్లోలో నోటికి వచ్చిన మాటలు అనేస్తున్నారు. ఇటీవల సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ సైతం ఓ సినిమా వేడుకలో చేసిన పదప్రయోగం చర్చకు దారితీసింది. ఇప్పుడు తాజాగా స్టార్ హీరో రవితేజ, సీనియర్ నటుడు అజయ్ ఘోష్ కూడా సినిమా వేదికపై చేసిన కొన్ని పదప్రయోగాలు సోషల్ మీడియాలో విమర్శలకు కారణమవుతున్నాయి.హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగిన ‘ఇరుముడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇందుకు వేదికైంది. కార్యక్రమం మొత్తం సందడిగా సాగినప్పటికీ.. రవితేజ, అజయ్ ఘోష్ మాట్లాడిన సమయంలో వినిపించిన ఒకట్రెండు అసభ్య పదాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా అజయ్ ఘోష్ తన ప్రసంగంలో ఉపయోగించిన కొన్ని పదాలపై సోషల్ మీడియాలో నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రవితేజను పొగిడే క్రమంలో అనుకోకుండా బూతు పదాలను వాడేశాడు. (చదవండి: రవితేజకు 26 ఎకరాల తోట.. ఇప్పుడు వందల కోట్ల విలువ!)మరో సందర్భంలో రవితేజ కూడా అభ్యంతరకరంగా భావించే ఓ పదాన్ని ఉపయోగించడంతో ఈ అంశంపై చర్చ మొదలైంది. వేదిక ముందు కూర్చొని ఉన్న రవితేజను ఈ సినిమాలో ఆయనకు కూతురిగా నటించిన నక్షత్ర కొన్ని ప్రశ్నలు అడిగింది. అందులో ఒకటి ‘నాకు నిక్ నేమ్ పెట్టమంటే ఏమని పెడతారు'.. అని అడగగా 'ముదురు ము...' అని రవితేజ అంటాడు. ఒక స్టార్ హీరో..చిన్న పిల్లను అలా అనడాన్ని నెటిజన్స్ తప్పుపడుతున్నారు. ప్రేమతో అన్నా సరే.. వేదికపై అలాంటి బూతు పదాన్ని వాడడం కరెక్ట్ కాదంటూ రవితేజను ట్రోల్ చేస్తున్నారు.(చదవండి:‘మీకు బీఫ్ నచ్చిందా?’ హీరోయిన్‌కి షాకింగ్ ప్రశ్న.. రియాక్షన్ ఇదే!)సాధారణ కమర్షియల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇలాంటి పదాలు వినిపిస్తే.. వాటిని పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కానీ ‘ఇరుముడి’ సినిమా విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. అయ్యప్ప స్వామి భక్తులకు ‘ఇరుముడి’ అనే పదానికి ఎంతో పవిత్రమైన అర్థం ఉంది. అంతేకాదు.. ఈ సినిమాలో రవితేజ అయ్యప్ప స్వామి మాలలో కనిపిస్తున్నారు. భక్తి, ఆధ్యాత్మిక నేపథ్యంతో తెరకెక్కుతున్న సినిమా ప్రమోషన్ కార్యక్రమంలోనే బూతు పదాలు వినిపించడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. -
నోరు జారిన అజయ్ ఘోష్...
-
రవితేజకు 26 ఎకరాల తోట.. ఇప్పుడు వందల కోట్ల విలువ!
టాలీవుడ్లో పలువురు హీరోలు సినిమాల ద్వారా సంపాదించిన డబ్బంతా భూములు, ఇతర స్థిరాస్తులపై పెట్టుబడిగా పెడుతుంటారు. ఈ జాబితాలో మాస్ మహారాజా రవితేజ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కొన్నేళ్ల క్రితం ఆయన శంకర్పల్లి సమీపంలో 26 ఎకరాల తోటను కేవలం రూ.12 లక్షలకు కొనుగోలు చేసినట్లు నటుడు అజయ్ ఘోష్ తెలిపారు. ప్రస్తుతం ఆ భూమి విలువ వందల కోట్లకు చేరిందని ఆయన చెప్పడం ఆసక్తికరంగా మారింది.రవితేజ, అజయ్ ఘోష్ కలిసి నటించిన ‘మాస్ జాతర’ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కోసం శంకర్పల్లి సమీపంలోని 26 ఎకరాల తోటలో రైల్వే స్టేషన్, ఇల్లు తదితర సెట్లు ఏర్పాటు చేసినట్లు అజయ్ ఘోష్ వెల్లడించారు. ఆ తోట రవితేజకు చెందినదేనని చెప్పారు.(చదవండి: నిజంలో బతకడం రవితేజకే చెల్లింది.. అజయ్ ఘోష్)‘ఇరుముడి’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో అజయ్ ఘోష్ మాట్లాడుతూ.. “నేను, రవితేజ కలిసి ‘మాస్ జాతర’ సినిమా చేశాం. ఆ సినిమాకు రైల్వే స్టేషన్ సెట్, ఇల్లు సెట్‌ను ఒక తోటలో వేశారు. శంకర్పల్లి దగ్గర ఉన్న 26 ఎకరాల తోట అది. ఆ తోట రవితేజ గారిదే. ఎప్పుడో దాన్ని రూ.12 లక్షలకు కొన్నారు. ఇప్పుడు దాని విలువ వందల కోట్లు ఉంది” అని తెలిపారు.అదే సమయంలో సెట్లో జరిగిన ఓ ఆసక్తికరమైన సంఘటనను కూడా అజయ్ ఘోష్ గుర్తుచేసుకున్నారు. ఆ తోట విలువ గురించి తెలుసుకున్న ఓ వ్యక్తి ఆశ్చర్యపోయి.. ‘ఈ తోట అన్ని కోట్ల విలువ చేస్తుందని అంట కదా?” అని రవితేజను అడిగారట. అందుకు రవితేజ స్పందిస్తూ.. ‘ఇవన్నీ ఇక్కడే ఉంటాయి.. మనం పోతాం. ఇవన్నీ ఉన్నాయని సంతోషించాలి. కానీ మనం పని చేసుకోవాలి’ అని చెప్పినట్లు అజయ్ ఘోష్ వెల్లడించారు. రవితేజ ఆస్తులపై అజయ్ ఘోష్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. -
రవితేజపై అజయ్ ఘోష్ ఆసక్తికర వ్యాఖ్యలు
టాలీవుడ్ సీనియర్ నటుడు అజయ్ ఘోష్ గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి పాత్రలో అయినా సరే పరకాయ ప్రవేశం చేస్తాడు. సినిమాల్లో ఎక్కువగా విలన్ పాత్రలు చేసినా..బయట మాత్రం చాలా మంచి మనిషి. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతాడు. తాజాగా ఈ నటుడు మాస్ మహారాజా రవితేజపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆదివారం జరిగిన ‘ఇరుముడి’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో అజయ్ ఘోష్ మాట్లాడుతూ..‘అల్లు అర్జున్, మహేశ్ బాబు, రామ్ చరణ్ లాంటి హీరోలతో కలిసి పనిచేశాను. కానీ ఆ పిల్లోడు (రవితేజ)తో ఉన్న అనుబంధం చాలా స్పెషల్. ఏ జన్మ బంధమో కానీ.. ఆయనతో పనిచేసినందుకు నేను చాలా అదృష్టవంతుడిని’ అని అన్నారు.రవితేజలో తాను ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని చూశానని అజయ్ ఘోష్ పేర్కొన్నారు. ‘నీలాంటి తాత్వికుడితో పనిచేశాను. వీళ్లందరికీ నువ్వొక హీరోలా కనిపిస్తావు. కానీ నేను నీలో ఒక జిడ్డు కృష్ణమూర్తిని చూశా. నిజంగా ఉన్నది ఉన్నట్లు.. మొహమాటం లేకుండా మాట్లాడటం.. నిజంలో బతకడం.. నిజంగా ఉండడం మీకే చెల్లింది’అని రవితేజను ప్రశంసించారు.నేను అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు లాంటి హీరోలతో పని చేశా.. కానీ రవితేజతో నా అనుబంధం..రవితేజలో ఒక జిడ్డు కృష్ణమూర్తి వున్నాడు.- Ajay Ghosh#Irumudi Grand Pre-Release Event pic.twitter.com/e063kqVf17— idlebrain.com (@idlebraindotcom) August 16, 2026 -
అజయ్ తెలుసు.. కానీ అజయ్ ఘోష్ అనుకోలేదు: రాశి ఆసక్తికర కామెంట్స్
తిరువీర్ నటించిన లేటెస్ట్ మూవీ 'పాపం ప్రతాప్'. 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' చిత్రంతో హిట్ కొట్టిన హీరో.. మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆయన హీరోగా నటించిన పాపం ప్రతాప్ ఈ రోజే థియేటర్లలో విడుదలైంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ హైదరాబాద్‌లో థ్యాంక్ యూ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన రాశి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.ఈ స్టోరీ చెప్పినప్పుడు నా పక్కన మొదట అజయ్ అనుకున్నానని రాశి తెలిపింది. టాలీవుడ్లో నాకు హైట్ ఎక్కువగా ఉండే అజయ్ మాత్రమే తెలుసని వెల్లడించింది. కానీ సెట్లో బయటికి వచ్చి అజయ్ కోసం వెతుకుతున్నా.. కానీ అక్కడే అజయ్ ఘోష్ చైర్లో కూర్చుని కనిపించారు. అజయ్ ఘోష్‌ని చూసి.. నాకు మావయ్య క్యారెక్టర్ ఏమోనని అనుకున్నానని రాశి చెప్పింది. కానీ ఎప్పుడైతే డైరెక్టర్ ఇతనే నా భర్త క్యారెక్టర్ అంటే షాక్ అయ్యానని అన్నారు. కానీ అజయ్ ఘోష్ అద్భుతంగా చేస్తారని రాశి కొనియాడింది. ఫస్ట్ టైమ్ ఆయనతో పని చేశానని తెలిపింది. సింగిల్ టేక్‌లో సీన్ చేయడం ఆయనకే సాధ్యమన్నారు రాశి. స్టోరీ చెప్పినప్పుడు నాకు పక్కన అజయ్ అనుకున్నా. సెట్ లో అజయ్ ఘోష్ ని చూసి అతను నాకు మావయ్య క్యారక్టర్ ఏమో అనుకున్నా. ఎప్పుడైతే డైరెక్టర్ ఇతనే నా భర్త క్యారెక్టర్ అంటే షాక్ అయ్యా.- Actress Raasi#PapamPrathap Thank You Meet pic.twitter.com/9769n5f7TT— idlebrain.com (@idlebraindotcom) April 17, 2026


