అజయ్ తెలుసు.. కానీ అజయ్ ఘోష్‌ అనుకోలేదు: రాశి ఆసక్తికర కామెంట్స్ | Tollywood actress Raasi about latest Movie Papam prathap experience | Sakshi
Sakshi News home page

Raasi: అజయ్ తెలుసు.. కానీ అజయ్ ఘోష్‌ అనుకోలేదు: రాశి కామెంట్స్ వైరల్

Apr 17 2026 9:52 PM | Updated on Apr 17 2026 9:54 PM

Tollywood actress Raasi about latest Movie Papam prathap experience

తిరువీర్ నటించిన లేటెస్ట్ మూవీ 'పాపం ప్రతాప్'.  'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' చిత్రంతో హిట్ కొట్టిన హీరో.. మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆయన హీరోగా నటించిన పాపం ప్రతాప్ ఈ రోజే థియేటర్లలో విడుదలైంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ హైదరాబాద్‌లో థ్యాంక్ యూ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన రాశి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.

ఈ స్టోరీ చెప్పినప్పుడు నా పక్కన మొదట అజయ్ అనుకున్నానని రాశి తెలిపింది. టాలీవుడ్‌లో నాకు హైట్‌ ఎక్కువగా ఉండే అజయ్ మాత్రమే తెలుసని వెల్లడించింది. కానీ సెట్‌లో బయటికి వచ్చి అజయ్ కోసం వెతుకుతున్నా.. కానీ అక్కడే అజయ్‌ ఘోష్ చైర్‌లో కూర్చుని కనిపించారు. అజయ్ ఘోష్‌ని చూసి.. నాకు మావయ్య క్యారెక్టర్ ఏమోనని అనుకున్నానని రాశి చెప్పింది. కానీ ఎప్పుడైతే డైరెక్టర్ ఇతనే నా భర్త క్యారెక్టర్ అంటే షాక్ అయ్యానని అన్నారు. కానీ అజయ్ ఘోష్ అద్భుతంగా చేస్తారని రాశి కొనియాడింది. ఫస్ట్‌ టైమ్‌ ఆయనతో పని చేశానని తెలిపింది. సింగిల్ టేక్‌లో సీన్ చేయడం ఆయనకే సాధ్యమన్నారు రాశి.
 

 

Advertisement
 
Advertisement
Advertisement