Papam Prathap Movie
-
ఆ సినిమా వల్ల అంత నెగెటివ్ అవుతాననుకోలేదు : రాశి
నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలనేది నా నా ఉద్దేశం.నెగెటివ్ రోలా? పాజిటివ్ క్యారెక్టరా? అనేది నేను పట్టించుకోను. పాత్ర నచ్చితే చేసేస్తా’ అని అన్నారు సినీయర్ నటి రాశి. ఆమె కీలక పాత్ర పోషించిన తాజా చిత్రం ‘పాపం ప్రతాప్’. తీరువీర్ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో రాశి హీరో తల్లి పాత్ర పోషించింది. చాలా కాలం తర్వాత రాశి తెరపై కనిపించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా ‘నిజం సినిమాలో నెగెటివ్ రోల్ చేయడంతో హీరోయిన్గా అవకాశాలు కోల్పోయారు కదా?’ అని ఓ విలేకరి ప్రశ్నించగా.. అవును. ఆ పాత్ర అంత నెగెటివ్ అవుతుందని ఊహించలేదన్నారు. ‘ఎలాంటి పాత్ర కావాలనేది నేను నిర్ణయించుకోలేదు. దర్శకులే వచ్చి..‘మిమ్మల్ని అనుకోనే ఈ పాత్ర రాశాను’ అంటారు. ఆ పాత్ర నచ్చితే చేస్తా. అంతేకాని అది నెగెటివ్ రోలా? పాజిటివ్ రోలా? అనేది చూడను. నటి అన్నాక.. ఓ నటిగా అన్నిరకాల షేడ్స్ ఉన్న రోల్స్ ప్లే చేయాలి. ఆ ఉద్దేశంతోనే ‘నిజం’లో నటించా. కానీ, ఆ పాత్ర అంతగా నెగెటివ్ అవుతుందని అనుకోలేదు. ఇకపై ఏ రోల్ అయినా ప్రేక్షకులు అంగీకరించేవిధంగా ఉంటేనే చేస్తాను’ అని రాశి అన్నారు. కాగా, తేజ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా నటించిన ‘నిజం’ సినిమాలో రాశి నెగెటివ్ పాత్ర చేసింది. విలన్‌గా నటించిన గోపిచంద్‌కి ప్రియురాలి పాత్ర అది. హీరోయిన్గా రాణిస్తున్న సమయంలోనే రాశి అలాంటి పాత్ర చేయడం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. అయితే ఆ సినిమా తర్వాత ఆమెకు హీరోయిన్గా చాన్స్ రాలేదు. దీంతో కొన్నాళ్ల పాటు వెండితెరకు దూరంగా ఉంది. ఇప్పుడు మళ్లీ సపోర్టింగ్ క్యారెక్టర్లు చేసేందుకు రెడీ అవుతుంది. అందులో భాగంగానే ‘పాపం ప్రతాప్’ మూవీ చేసింది. ఈ చిత్రానికి ఎస్పీ దుర్గా నరేశ్ దర్శకత్వం వహించారు. -
'పాపం ప్రతాప్' మూవీ థ్యాంక్ యూ మీట్ (ఫొటోలు)
-
అజయ్ తెలుసు.. కానీ అజయ్ ఘోష్ అనుకోలేదు: రాశి ఆసక్తికర కామెంట్స్
తిరువీర్ నటించిన లేటెస్ట్ మూవీ 'పాపం ప్రతాప్'. 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' చిత్రంతో హిట్ కొట్టిన హీరో.. మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆయన హీరోగా నటించిన పాపం ప్రతాప్ ఈ రోజే థియేటర్లలో విడుదలైంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ హైదరాబాద్‌లో థ్యాంక్ యూ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన రాశి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.ఈ స్టోరీ చెప్పినప్పుడు నా పక్కన మొదట అజయ్ అనుకున్నానని రాశి తెలిపింది. టాలీవుడ్లో నాకు హైట్ ఎక్కువగా ఉండే అజయ్ మాత్రమే తెలుసని వెల్లడించింది. కానీ సెట్లో బయటికి వచ్చి అజయ్ కోసం వెతుకుతున్నా.. కానీ అక్కడే అజయ్ ఘోష్ చైర్లో కూర్చుని కనిపించారు. అజయ్ ఘోష్‌ని చూసి.. నాకు మావయ్య క్యారెక్టర్ ఏమోనని అనుకున్నానని రాశి చెప్పింది. కానీ ఎప్పుడైతే డైరెక్టర్ ఇతనే నా భర్త క్యారెక్టర్ అంటే షాక్ అయ్యానని అన్నారు. కానీ అజయ్ ఘోష్ అద్భుతంగా చేస్తారని రాశి కొనియాడింది. ఫస్ట్ టైమ్ ఆయనతో పని చేశానని తెలిపింది. సింగిల్ టేక్‌లో సీన్ చేయడం ఆయనకే సాధ్యమన్నారు రాశి. స్టోరీ చెప్పినప్పుడు నాకు పక్కన అజయ్ అనుకున్నా. సెట్ లో అజయ్ ఘోష్ ని చూసి అతను నాకు మావయ్య క్యారక్టర్ ఏమో అనుకున్నా. ఎప్పుడైతే డైరెక్టర్ ఇతనే నా భర్త క్యారెక్టర్ అంటే షాక్ అయ్యా.- Actress Raasi#PapamPrathap Thank You Meet pic.twitter.com/9769n5f7TT— idlebrain.com (@idlebraindotcom) April 17, 2026 -
పాపం ప్రతాప్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
చిన్న సినిమాలతో మంచి విజయాలు అందుకుంటున్న తెలుగు హీరో తీరువీర్. మసూద సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తీరువీర్.. పరేషాన్, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆయన నటించిన తాజా చిత్రం పాపం ప్రతాప్. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను ఈ ‘ప్రతాప్’ అందుకున్నాడా? తిరువీర్ ఖాతాలో మరో హిట్ పడిందా? లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఈ సినిమా కథ 1994-98 మధ్య కాలంలో సాగుతుంది. ప్రతాప్ (తిరువీర్)కి బుజ్జమ్మ(పాయల్ రాధాకృష్ణ) అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. వయసుతో పాటు ఆమెపై ప్రేమ కూడా పెరుగుతుంది. ఓ రోజు బుజ్జమ్మనే ‘పెళ్లి చేసుకుందామా’ అని అడగడంతో..ప్రతాప్ వెంటనే ముహూర్తం పెట్టిస్తాడు. నాన్న రంగయ్య(అజయ్ ఘోష్)కి ఇష్టం లేకపోయినా.. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంటాడు. మొదటి మూడు రాత్రులు గడవగానే బుజ్జమ్మ పంచాయితీ పెడుతుంది. ప్రతాప్‌కి సమస్య ఉందని.. అతనితో సంసారం చేయలేనని ఊరిపెద్దలకు చెబుతుంది. ప్రతాప్‌కి ఉన్న సమస్య ఏంటని అడిగితే మాత్రం బయటకు చెప్పదు. అంతేకాదు తనలోని సమస్యేమిటో తనే తెలుసుకుని సరిదిద్దుకుంటేనే కాపురానికి వస్తానని చెప్పి..పుట్టింటికి వెళ్లిపోతుంది. అసలు ప్రతాప్‌కి ఉన్న సమస్య ఏంటి? ఆ సమస్యను కనుక్కునేందుకు ప్రతాప్ చేసిన ప్రయత్నాలు ఏంటి? సమస్య తెలుసుకున్నాక..దాన్ని సరిదిద్దుకున్నాడా లేదా? చివరకు బుజ్జమ్మ, ప్రతాప్ ఒక్కటయ్యారా లేదా ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఎలా ఉందంటే..ఓ సున్నితమైన సమస్య చుట్టు తిరిగే కథ ఇది. ప్రేమ ఒకవైపు.. వింత సమస్య మరోవైపు.. ఈ రెండింటి మధ్య జరిగే సంఘర్షణలో ఏది పై చేయి సాధించింది అనేదే ఈ కథలో కీలకం. యదార్థ సంఘటనల ఆధారంగా చేసుకొని దర్శకుడు ఎస్పీ దుర్గా నరేశ్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఆయన ఎంచుకున్న పాయింట్ చాలా చిన్నది. దానికి పల్లెటూరి వాతావరణం, ఫ్యామిలీ ఎమోషన్స్‌ని యాడ్ చేసి ఫుల్ ఎంటర్టైనింగ్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. బుజ్జమ్మ, ప్రతాప్‌ల చిన్నప్పటి లవ్‌స్టోరీతో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ వెంటనే వారిద్దరిని పెద్దవాళ్లుగా పరిచయం చేసి.. పెళ్లి, తర్వాత ప్రతాప్ సమస్యను తెలియజేసి అసలు కథలోకి తీసుకెళ్లాడు. అయితే ప్రతాప్‌కి ఉన్న సమస్య ఏంటనేది వెంటనే చెప్పకుండా... కాసేపటి వరకు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేలా చేశాడు. పంచాయితీలో ఆ సమస్య గురించి చెప్పినప్పుడు.. దీనికి ఎందుకు పంచాయితీ పెట్టడం అనిపిస్తుంది. ఆ తర్వాత ఒక్కో విషయం తెలిసేకొద్ది.. నిజంగానే అది పెద్ద సమస్య అనిపిస్తుంది. అయితే పెళ్లి అయిన వెంటనే ఇంట్లో వాళ్లకు చెప్పకుండా.. పంచాయితీ పెట్టడం అనేది కాస్త సినిమాటిక్‌గా అనిపిస్తుంది. అలాగే ఆ సమస్యకి.. ప్రతాప్ ప్రేమకి ముడిపెట్టడం కూడా అతికినట్లుగా అనిపించదు. అయితే హీరో సమస్య గురించి ఊర్లో వాళ్లు రకరకాలుగా మాట్లాడడం.. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు కొంతమేర నవ్వులు పూయిస్తాయి. ఇంటర్వెల్ సీన్ సెకండాప్పై ఆసక్తిని పెంచుతుంది. ఇక కీలకమైన ద్వితియార్థంతో కథనం నెమ్మదిగా సాగడం.. అటు కామెడీ సరిగా పండక..ఇటు ఎమోషనల్ సీన్లు కూడా తేలిపోవడంతో బోర్ కొడుతుంది. హీరోకి ఉన్న సమస్యను పరిష్కరించుకునేందుకు చేసే పనులు సిల్లీగా అనిపిస్తుంది. అయితే ఆ సమస్య ఎలా వచ్చిందో తెలియజేసే ప్లాష్‌బ్యాక్ స్టోరీ ఆసక్తికరంగా అనిపిస్తుంది. క్లైమాక్స్ బాగుంటుంది. ఎవరెలా చేశారంటే..ఈ మూవీకి ప్రధాన బలం తిరువీర్.. తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. చాలా సినిమాల్లో నటించిన వారికి మాత్రమే సాధ్యపడే పాత్రలో ఆయన మెప్పించారు. అమాయకత్వంతో ఉన్న ఈ పాత్రలో సరిగ్గా సెట్ అయ్యారు. హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ ఎంపిక కూడా బాగుంది అనిపిస్తుంది. అజయ్ ఘోష్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వంద శాతం తన పాత్రకు న్యాయం చేశాడు. ఒకప్పటి హీరోయిన్ రాశి..హీరో తల్లిగా తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. కె.ఎం.రాధాకృష్ణన్ సంగీతం బాగుంది. పాటలు ప్రేక్షకులను మెప్పిస్తాయి. సినిమాటోగ్రఫీ విశ్వేశ్వర్ ఎస్.వి పర్వాలేదనిపిస్తుంది. -
‘పాపం ప్రతాప్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
అజయ్ కోపం చూసి షాక్ అయిన మంచు లక్ష్మి
-
అందుకే ప్రభాస్ ‘ఫౌజీ’లో నటించలేదు : తీరువీర్
యంగ్ హీరో తీరువీర్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. చిన్న చిన్న పాత్రలతో కెరీర్‌ని ప్రారంభించిన తీరువీర్.. ఇప్పుడు హీరోగా ఫుల్ బిజీ అయిపోయాడు. డిఫరెంట్ కాన్సెప్ట్‌లను ఎంచుకుంటూ.. కొత్త కొత్త పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం పాపం ప్రతాప్ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ యూట్యూబ్ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తీరువీర్ ఓ ఆసక్తికర విషయం పంచుకున్నాడు. ప్రభాస్‌తో కలిసి నటించే అవకాశం వచ్చినా.. వదిలేశాడట.‘హీరోగానే కాకుండా సపోర్టింగ్ యాక్టర్‌గానూ అవకాశాలు వస్తున్నాయి. కానీ కొన్ని కథలు నచ్చక రిజెక్ట్ చేశాను. మరికొన్ని నచ్చినా.. డేట్స్, లుక్ సెట్ కాక వదులుకోవాల్సి వచ్చింది. విజయ్ దేవరకొండ కింగ్డమ్లో మురుగన్ పాత్ర నేనే చేయాల్సింది. కానీ డేట్స్ కుదరలేదు. అలాగే ప్రభాస్ ‘ఫౌజీ’లోనూ ఒక పాత్ర కోసం నన్ను అడిగారు. కానీ నేను వేరే వేరే సినిమాలతో బీజీగా ఉండడం.. ఒక్కో నెలకు ఒక్కో లుక్‌లో ఉండాల్సి రావడంతో అది కూడా వదులుకోవాల్సి వచ్చింది. నా కోసం వాళ్లు షూటింగ్ ఆపుకోలేరు. వాళ్లకు ప్రయారిటీస్ ఉంటాయి. బడ్జెట్..కండీషన్స్ ..టార్గెట్స్ అన్నీ ఉంటాయి. మన వల్ల అవ్వనప్పుడు మనం ఇబ్బంది పడొద్దు..ఎదుటి వాళ్లను ఇబ్బంది పెట్టొద్దు. అందుకే కొన్ని నచ్చిన పాత్రలను కూడా వదిలేశా.ఇండస్ట్రీ చాలా చిన్నది. ఏ హీరో ఏ సినిమా చేస్తున్నాడు అనేది అందరికి తెలుసు. అందుకే డేట్స్ కుదరట్లేదు అంటే అర్థం చేసుకుంటారు. ప్రస్తుతం నేను సపోర్టింగ్ యాక్టర్‌గా ఏ సినిమా చేయట్లేదు. హీరోగా నటించిన రెండు, మూడు సినిమాలు ఈ ఏడాదిలోనే విడుదలయ్యే అవకాశం ఉంది’ అని తీరువీర్ చెప్పుకొచ్చాడు. -
పెళ్లయిన మూడోరోజే భార్య వదిలేస్తే.. ఫన్నీగా ట్రైలర్
అడపాదడపా హీరోగా సినిమాలు చేసే తిరువీర్ నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ 'పాపం ప్రతాప్'. గతేడాది డిసెంబరులో 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' చిత్రంతో హిట్ కొట్టిన ఇతడు.. ఇప్పుడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఈ శుక్రవారమే థియేటర్లలోకి రానుండగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది ఆకట్టుకునేలా ఉంది.(ఇదీ చదవండి: రాత్రి 2 గంటలకు ఫోన్ చేశాడు.. కంగారుపడ్డా: కాయదు లోహర్)1998లో గోదావరిలో జరిగే కథగా దీన్ని చూపించారు. ప్రతాప్, బుజ్జమ్మని పెళ్లి చేసుకుంటాడు. కానీ మూడో రోజే ఆమె.. ప్రతాప్‌ని వదిలి వెళ్లిపోతుంది. తర్వాతరోజు పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ పెడుతుంది. ఇంతకీ వీళ్లిద్దరి మధ్య ఏం జరిగింది? ప్రతాప్ ఏమైనా చేశాడా? ప్రతాప్‌కే ఏమైనా జరిగిందా అనేదే కాన్సెప్ట్‌లా అనిపిస్తుంది. 'ఒకమ్మాయి ఇల్లు వదిలి వెళ్లిందంటే అబ్బాయి ఏం చేశాడని అడుగుతారు. కానీ ఆ అబ్బాయికి ఏం జరిగిందని ఎవరూ అడగరు' అనే డైలాగ్ ఆసక్తికరంగా అనిపించింది. నవ్వుని నటిస్తూ బతుకుతున్న ప్రతి మగాడి కథ అని చివరో ఓ లైన్ వేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)


