అందుకే ప్రభాస్‌ ‘ఫౌజీ’లో నటించలేదు : తీరువీర్‌ | Thiruveer Reject Prabhas Fauzi Movie, Due To This Reason | Sakshi
Sakshi News home page

ఒక్కో నెలకు ఒక్కోలా ఉంటా..అందుకే ‘ఫౌజీ’ వదిలేశా : తిరువీర్‌

Apr 15 2026 1:27 PM | Updated on Apr 15 2026 1:53 PM

Thiruveer Reject Prabhas Fauzi Movie, Due To This Reason

యంగ్‌ హీరో తీరువీర్‌ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. చిన్న చిన్న పాత్రలతో కెరీర్‌ని ప్రారంభించిన తీరువీర్‌.. ఇప్పుడు హీరోగా ఫుల్‌ బిజీ అయిపోయాడు. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌లను ఎంచుకుంటూ.. కొత్త కొత్త పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం పాపం ప్రతాప్‌ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ యూట్యూబ్‌ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తీరువీర్‌ ఓ ఆసక్తికర విషయం పంచుకున్నాడు. ప్రభాస్‌తో కలిసి నటించే అవకాశం వచ్చినా.. వదిలేశాడట.

‘హీరోగానే కాకుండా సపోర్టింగ్‌ యాక్టర్‌గానూ అవకాశాలు వస్తున్నాయి. కానీ కొన్ని కథలు నచ్చక రిజెక్ట్‌ చేశాను. మరికొన్ని నచ్చినా.. డేట్స్‌, లుక్‌ సెట్‌ కాక వదులుకోవాల్సి వచ్చింది. విజయ్‌ దేవరకొండ కింగ్‌డమ్‌లో మురుగన్‌ పాత్ర నేనే చేయాల్సింది. కానీ డేట్స్‌ కుదరలేదు. అలాగే ప్రభాస్‌ ‘ఫౌజీ’లోనూ ఒక పాత్ర కోసం నన్ను అడిగారు. కానీ నేను వేరే వేరే సినిమాలతో బీజీగా ఉండడం.. ఒక్కో నెలకు ఒక్కో లుక్‌లో ఉండాల్సి రావడంతో అది కూడా వదులుకోవాల్సి వచ్చింది.  నా కోసం వాళ్లు షూటింగ్‌ ఆపుకోలేరు. వాళ్లకు ప్రయారిటీస్‌ ఉంటాయి. బడ్జెట్‌..కండీషన్స్‌ ..టార్గెట్స్‌ అన్నీ ఉంటాయి. మన వల్ల అవ్వనప్పుడు మనం ఇబ్బంది పడొద్దు..ఎదుటి వాళ్లను ఇబ్బంది పెట్టొద్దు. అందుకే కొన్ని నచ్చిన పాత్రలను కూడా వదిలేశా.

ఇండస్ట్రీ చాలా చిన్నది. ఏ హీరో ఏ సినిమా చేస్తున్నాడు అనేది అందరికి తెలుసు. అందుకే డేట్స్‌ కుదరట్లేదు అంటే అర్థం చేసుకుంటారు. ప్రస్తుతం నేను సపోర్టింగ్‌ యాక్టర్‌గా ఏ  సినిమా చేయట్లేదు. హీరోగా నటించిన రెండు, మూడు సినిమాలు ఈ ఏడాదిలోనే విడుదలయ్యే అవకాశం ఉంది’ అని తీరువీర్‌ చెప్పుకొచ్చాడు. 

Advertisement
 
Advertisement
Advertisement