పెళ్లయిన మూడోరోజే భార్య వదిలేస్తే.. ఫన్నీగా ట్రైలర్ | Thiruveer's Papam Prathap Movie Trailer Out Now | Sakshi
Sakshi News home page

Papam Prathap Trailer: నవ్వుని నటిస్తూ బతుకుతున్న ప్రతి మగాడి కథ

Apr 12 2026 10:42 AM | Updated on Apr 12 2026 10:56 AM

Thiruveer's Papam Prathap Movie Trailer Out Now

అడపాదడపా హీరోగా సినిమాలు చేసే తిరువీర్ నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ 'పాపం ప్రతాప్'. గతేడాది డిసెంబరులో 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' చిత్రంతో హిట్ కొట్టిన ఇతడు.. ఇప్పుడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఈ శుక్రవారమే థియేటర్లలోకి రానుండగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది ఆకట్టుకునేలా ఉంది.

(ఇదీ చదవండి: రాత్రి 2 గంటలకు ఫోన్ చేశాడు.. కంగారుపడ్డా: కాయదు లోహర్)

1998లో గోదావరిలో జరిగే కథగా దీన్ని చూపించారు. ప్రతాప్, బుజ్జమ్మని పెళ్లి చేసుకుంటాడు. కానీ మూడో రోజే ఆమె.. ప్రతాప్‌ని వదిలి వెళ్లిపోతుంది. తర్వాతరోజు పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ పెడుతుంది. ఇంతకీ వీళ్లిద్దరి మధ్య ఏం జరిగింది? ప్రతాప్ ఏమైనా చేశాడా? ప్రతాప్‌కే ఏమైనా జరిగిందా అనేదే కాన్సెప్ట్‌లా అనిపిస్తుంది. 'ఒకమ్మాయి ఇల్లు వదిలి వెళ్లిందంటే అబ్బాయి ఏం చేశాడని అడుగుతారు. కానీ ఆ అబ్బాయికి ఏం జరిగిందని ఎవరూ అడగరు' అనే డైలాగ్ ఆసక్తికరంగా అనిపించింది. నవ్వుని నటిస్తూ బతుకుతున్న ప్రతి మగాడి కథ అని చివరో ఓ లైన్ వేశారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)

Advertisement
 
Advertisement
Advertisement