ఓటీటీలోకి వచ్చిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా | The Deal Movie 2024 Telugu OTT Streaming Now | Sakshi
Sakshi News home page

OTT: ఓటీటీలో తెలుగు మూవీ.. రెండేళ్ల తర్వాత స్ట్రీమింగ్

Apr 12 2026 9:11 AM | Updated on Apr 12 2026 10:23 AM

The Deal Movie 2024 Telugu OTT Streaming Now

ఈ వారం థియేటర్లలోకి వచ్చిన అడివి శేష్ 'డెకాయిట్', ప్రదీప్ రంగనాథన్ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. మరోవైపు ఓటీటీలో మాత్రం బోలెడన్ని కొత్త మూవీస్ వచ్చాయి. వీటిలో తాయ్ కిళవి, శబ్దం, డార్క్ నైట్, ఓ రోమియో, తూ యా మై, త్రాష్ తదితర చిత్రాలున్నాయి. ఇప్పుడు వీటికి తోడుగా ఓ తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కూడా అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ ఏంటది? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?

(ఇదీ చదవండి: ఓటీటీలో రాధిక సూపర్ హిట్ సినిమా.. తెలుగు రివ్యూ)

ప్రభాస్ 'ఈశ్వర్' సినిమాలో నటించి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హను కోట్ల.. హీరోగా చేసి, దర్శకత్వం వహించిన మూవీ 'ద డీల్'. 2024 అక్టోబరులో థియేటర్లలోకి వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో తీసినప్పటికీ పెద్దగా స్టార్స్ లేకపోవడం, సరైన స్టోరీ కూడా లేకపోవడంతో ఏ మాత్రం మెప్పించలేకపోయింది. ఇప్పుడీ మూవీ అద్దె విధానంలో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది.

'ద డీల్' విషయానికొస్తే.. యాక్సిడెంట్ దెబ్బకు గతం మర్చిపోయిన భైరం(హను కోట్ల) మెలకువ వచ్చిన తర్వాత లక్ష‍్మి(ధరణి ప్రియా) అనే పేరు కలవరిస్తుంటాడు. ఈమె తన భార్య అని, కలవాలని అంటాడు. మరోవైపు తనని చంపాలని చూస్తున్నారనే విషయం తెలుసుకున్న భైరవ.. తాను అసలు ఎవరో అని కనుగొనే ప్రయత్నంలోనూ ఉంటాడు. మరి భైరవ జీవితంలో ఇందు, మాధవ్ పాత్రేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: రాత్రి 2 గంటలకు ఫోన్ చేశాడు.. కంగారుపడ్డా: కాయదు లోహర్)

Advertisement
 
Advertisement
Advertisement