రాత్రి 2 గంటలకు ఫోన్ చేశాడు.. నిద్రలేకుండా రిహార్సల్స్ | Kayadu Lohar Reveals Pavazha Malli Song Chance | Sakshi
Sakshi News home page

Kayadu Lohar: నేనే కావాలని అన్నాడు.. ఓకే చెప్పేసా

Apr 12 2026 7:27 AM | Updated on Apr 12 2026 7:34 AM

Kayadu Lohar Reveals Pavazha Malli Song Chance

రీసెంట్ టైంలో దక్షిణాదిలో ఓవర్ నైట్ స్టార్‌డమ్ సంపాదించిన హీరోయిన్ ఎవరంటే చాలామంది కాయదు లోహర్ అని చెబుతారు. ఎందుకంటే ప్రదీప్ రంగనాథన్‌తో చేసిన 'డ్రాగన్' మూవీ ఈమెకు మంచి గుర్తింపు తెచ్చింది. కానీ అంతకుముందే తెలుగులో ఓ మూవీ చేసినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. ప్రస్తుతం నాని 'ప్యారడైజ్'లో హీరోయిన్‌గా చేస్తోంది. ఈమె నటించిన తొలి మలయాళ మూవీ 'పల్లి చట్టంబి' ఈ వీకెండే థియేటర్లలోకి వచ్చింది. దీని ప్రమోషన్లలో భాగంగానే తాను చేసిన తొలి ఆల్బమ్ సాంగ్ గురించి, అందులో అవకాశం రావడం గురించి కూడా మాట్లాడింది.

(ఇదీ చదవండి: శివాజీ సృష్టించిన చీర అంటూ అనసూయ కౌంటర్‌)

'డ్యూడ్' మూవీతో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న సాయి అభ్యంకర్.. మరోవైపు ఆల్బమ్ సాంగ్స్ కూడా చేస్తున్నాడు. అలా ఇతడి నుంచి 'పవళ మల్లి' పేరుతో గత నెలలో ఓ సాంగ్ వచ్చింది. ఇందులోనే సాయికి జోడీగా కాయదు కనిపించింది. యూట్యూబ్‌లో హిట్ అయిన ఈ పాటకు ఇప్పటివరకు 8 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇందులో అవకాశం ఎలా వచ్చిందో కాయదు తాజాగా బయటపెట్టింది.

'పవళ మల్లి' పాటలో అనుకోకుండానే నాకు అవకాశమొచ్చింది. ఓ రోజు అర్థరాత్రి 2 గంటలకు సంగీత దర్శకుడు సాయి నుంచి నాకు కాల్ వచ్చింది. ఈ టైంలో ఫోన్ చేసేసరికి కంగారుపడ్డా. ఏమైందని అడిగితే.. తాను ఓ పాట కంపోజ్ చేశానని, చాలా బాగా వచ్చిందని చెప్పాడు. అందులో కచ్చితంగా ఉండాలని నన్ను అడిగాడు. తర్వాత పాట విన్నా, బాగా నచ్చేసరికి వెంటనే ఓకే చెప్పేశా. ఎంజాయ్ చేస్తూనే ఆ పాట పూర్తిచేశాం. ఇందుకోసం 2 రోజులు నిద్రలేకుండా రిహార్సల్స్ చేశాం. ఆడియెన్స్ కూడా పాటని ఎంజాయ్ చేస్తున్నందుకు మాకు సంతోషంగా అనిపించింది' అని కాయదు చెప్పుకొచ్చింది. ఈ పాటని సాయి, శ్రుతి హాసన్ కలిసి పాడారు.

(ఇదీ చదవండి: ఓటీటీలో రాధిక సూపర్ హిట్ సినిమా.. తెలుగు రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement