breaking news
Sai Abhyankkar
-
'డ్యూడ్' కాంబో రిపీట్.. కొత్త సినిమాకు ఏకంగా ఆరుగురు డైరెక్టర్లు
లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకుని.. వీటన్నింటితోనూ చెరో రూ.100 కోట్ల కలెక్షన్స్ అందుకున్న తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్.. రీసెంట్ టైంలో 'ఎల్ఐకే' మూవీతో తొలి ఫ్లాప్ చూశారు. దాని సంగతి పక్కనబెడితే తాను హీరోగా చేయబోతున్న కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. ఈ మేరకు అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేశాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)హీరో కాకముందు ప్రదీప్ రంగనాథన్.. షార్ట్ ఫిల్మ్స్ తీశాడు. 'కోమలి' మూవీతో దర్శకుడిగా మారాడు. 'లవ్ టుడే' చిత్రానికి కూడా ఇతడే దర్శకుడు. మళ్లీ చాన్నాళ్ల తర్వాత తన మూవీ తానే స్టోరీ రాశాడు. అదే ఈ ప్రాజెక్ట్. దీనితోనే నిర్మాతగానూ మారాడు. తన దగ్గర పనిచేసిన ఆరుగురు కుర్రాళ్లని 'ద ఆల్ఫా టీమ్' మార్చి దీనికి దర్శకత్వ బాధ్యతలు అప్పగించాడు.ఇకపోతే ఈ మూవీలో 'డ్యూడ్' కాంబో రిపీటైంది. ప్రదీప్ రంగనాథన్-మమిత బైజు హీరోహీరోయిన్లుగా కాగా లేటెస్ట్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతమందిస్తున్నాడు. తెలుగు నటుడు శివాజీతో పాటు శ్వాసిక, అశ్వత్ మారిముత్తు కీలక పాత్రలు చేయనున్నారు. అనామిక మహి అనే అమ్మాయిని ఈ మూవీతో హీరోయిన్గా పరిచయం చేస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.(ఇదీ చదవండి: అప్పుడు నేను ముఖ్యమంత్రి అవుతా: కమల్ హాసన్) -
ఆరో క్లాస్ నుంచి చేస్తున్నా.. నా దగ్గర 1000 పాటలున్నాయి
సాయి అభ్యంకర్.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు కూడా కాస్త సుపరిచతమే. ఎందుకంటే రీసెంట్ టైంలో తన పాటలతో సంచలనం సృష్టిస్తున్నాడు. గతేడాది రిలీజైన 'డ్యూడ్' మూవీ సాంగ్స్ కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఇతడే. ప్రస్తుతం అల్లు అర్జున్, సూర్య లాంటి స్టార్ హీరోల సినిమాలకు పనిచేస్తున్న ఇతడు.. అందరూ అవాక్కయ్యే విషయాన్ని బయటపెట్టాడు. తన దగ్గర ప్రస్తుతం వెయ్యకి పైగానే పాటలు సిద్ధంగా ఉన్నాయని షాకిచ్చాడు.(ఇదీ చదవండి: 'రాకా' మ్యూజిక్ ఇంటర్నేషనల్.. సాయి వ్యాఖ్యలు వైరల్)'నేను ఆరో తరగతిలో ఉన్నప్పటి నుంచి సంగీతం ప్రాక్టీస్ చేస్తున్నా. పాటల్ని కంపోజ్ చేస్తున్నా. ఇప్పటికే నా దగ్గర 1000కి పైగా పాటలు రెడీగా ఉన్నాయి. కాకపోతే వాటిని ఇప్పుడు ఉపయోగించను. నాకు 60 ఏళ్లు దాటిన తర్వాత ఆ పాటల్ని బయటకు తీస్తా. ఇప్పుడు నేను పెద్ద సినిమాలు చేస్తున్నాను. కాబట్టి వాటిపై ఆధారపడటం కంటే కొత్తగా పాటలు కంపోజ్ చేయాలి' అని సాయి అభ్యంకర్ చెప్పుకొచ్చాడు.ఎన్నో పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సింగర్స్ టిప్పు-హరిణిల కొడుకే ఈ సాయి అభ్యంకర్. సొంతంగా ఆల్బమ్ సాంగ్స్ చేసి ఫేమస్ అయిన ఇతడు.. ప్రస్తుతం తెలుగు, తమిళంలో స్టార్ హీరోల సినిమాలకు పనిచేస్తున్నాడు. తమిళంలో అయితే అనిరుధ్‌కి సాయి పోటీ వచ్చాడని మాట్లాడుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఇతడి మ్యూజిక్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు) -
రాకా మ్యూజిక్ ఇంటర్నేషనల్.. డైరెక్టర్ వ్యాఖ్యలు వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - దర్శకుడు అట్లీ సినిమా రాకా.. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి బన్నీ ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా చిత్ర సంగీత దర్శకుడు సాయి అభ్యంకార్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ మూవీలో సంగీతం ఎలా ఉండబోతుందో ఆయన పేర్కొన్నారు. రాకా సినిమా కోసం మొదటిసారి దర్శకుడు అట్లీని కలిసినప్పుడు జరిగిన సంఘటనను ఆయన మరోసారి గుర్తుచేసుకున్నారు.రాకా సినిమా సంగీతం విషయంలో దర్శకుడు అట్లీకి క్లియర్ విజన్ ఉందని సాయి అభ్యంకార్ ఇలా చెప్పారు. 'రాకా కోసం సౌండ్ ట్రాక్ ఎలా ఉండాలని అట్లీ ముందే చెప్పారు. అందుకు అనుగుణంగానే ఇప్పటికే మేము చాలా పాటలను క్రియేట్ చేశాం. అవన్నీ కూడా బాగానే వచ్చాయి. అల్లు అర్జున్ సార్‌కు సంగీతం అంటే చాలా ఇష్టం. రాకా పాటలు, సంగీతం అంతర్జాతీయ స్థాయిలో మెప్పించాలని అందుకు తగ్గట్టుగానే అంతర్జాతీయ గాయకులు, గీత రచయితలతో కలిసి పనిచేయాలని కోరుకున్నాము. ప్రతి ట్రాక్‌లో మ్యూజిక్ బలంగా ఉండాలని ప్లాన్ చేశాం. అట్లీ అన్న కథ చెప్పిన తర్వాత, ఈ ఆల్బమ్‌ను ఎలా తీసుకురావాలనే దానిపై నాకు చాలా క్లారిటీ లభించింది.వెయ్యికి పైగా పాటలు తన వద్ద ఉన్నాయని సంగీత దర్శకుడు సాయి అభ్యంకార్ తెలిపారు. ప్రముఖ గాయకులు టిప్పు- హరిణి కుమారుడిగా ఎంట్రీ ఇచ్చిన సాయి.. డ్యూడ్ మూవీతో తెలుగు వారిని మెప్పించాడు. రాకాతో పాటు సూర్య కరుప్పు, బెంజ్, మార్షల్, డీ 55 వంటి ప్రాజెక్ట్‌లకు ఆయన పనిచేస్తున్నాడు. Sai Abhyankar says #Raaka’s music could go international, featuring multiple international collaborations 🎶pic.twitter.com/hZZFtT466B— Mohammed Ihsan (@ihsan21792) April 20, 2026 -
రాత్రి 2 గంటలకు ఫోన్ చేశాడు.. నిద్రలేకుండా రిహార్సల్స్
రీసెంట్ టైంలో దక్షిణాదిలో ఓవర్ నైట్ స్టార్డమ్ సంపాదించిన హీరోయిన్ ఎవరంటే చాలామంది కాయదు లోహర్ అని చెబుతారు. ఎందుకంటే ప్రదీప్ రంగనాథన్‌తో చేసిన 'డ్రాగన్' మూవీ ఈమెకు మంచి గుర్తింపు తెచ్చింది. కానీ అంతకుముందే తెలుగులో ఓ మూవీ చేసినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. ప్రస్తుతం నాని 'ప్యారడైజ్'లో హీరోయిన్గా చేస్తోంది. ఈమె నటించిన తొలి మలయాళ మూవీ 'పల్లి చట్టంబి' ఈ వీకెండే థియేటర్లలోకి వచ్చింది. దీని ప్రమోషన్లలో భాగంగానే తాను చేసిన తొలి ఆల్బమ్ సాంగ్ గురించి, అందులో అవకాశం రావడం గురించి కూడా మాట్లాడింది.(ఇదీ చదవండి: శివాజీ సృష్టించిన చీర అంటూ అనసూయ కౌంటర్)'డ్యూడ్' మూవీతో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న సాయి అభ్యంకర్.. మరోవైపు ఆల్బమ్ సాంగ్స్ కూడా చేస్తున్నాడు. అలా ఇతడి నుంచి 'పవళ మల్లి' పేరుతో గత నెలలో ఓ సాంగ్ వచ్చింది. ఇందులోనే సాయికి జోడీగా కాయదు కనిపించింది. యూట్యూబ్‌లో హిట్ అయిన ఈ పాటకు ఇప్పటివరకు 8 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇందులో అవకాశం ఎలా వచ్చిందో కాయదు తాజాగా బయటపెట్టింది.'పవళ మల్లి' పాటలో అనుకోకుండానే నాకు అవకాశమొచ్చింది. ఓ రోజు అర్థరాత్రి 2 గంటలకు సంగీత దర్శకుడు సాయి నుంచి నాకు కాల్ వచ్చింది. ఈ టైంలో ఫోన్ చేసేసరికి కంగారుపడ్డా. ఏమైందని అడిగితే.. తాను ఓ పాట కంపోజ్ చేశానని, చాలా బాగా వచ్చిందని చెప్పాడు. అందులో కచ్చితంగా ఉండాలని నన్ను అడిగాడు. తర్వాత పాట విన్నా, బాగా నచ్చేసరికి వెంటనే ఓకే చెప్పేశా. ఎంజాయ్ చేస్తూనే ఆ పాట పూర్తిచేశాం. ఇందుకోసం 2 రోజులు నిద్రలేకుండా రిహార్సల్స్ చేశాం. ఆడియెన్స్ కూడా పాటని ఎంజాయ్ చేస్తున్నందుకు మాకు సంతోషంగా అనిపించింది' అని కాయదు చెప్పుకొచ్చింది. ఈ పాటని సాయి, శ్రుతి హాసన్ కలిసి పాడారు.(ఇదీ చదవండి: ఓటీటీలో రాధిక సూపర్ హిట్ సినిమా.. తెలుగు రివ్యూ)#KayaduLohar Recent- #Sai called me at 2 AM and said, #Kayadu, we have a beautiful song, and I really want you to be a part of it.- I think it’s going to be a blast, and you’re the perfect one. When I heard it, I immediately fell for it.pic.twitter.com/UHWoT6824v— Movie Tamil (@_MovieTamil) April 11, 2026


