రాకా మ్యూజిక్‌ ఇంటర్నేషనల్‌.. డైరెక్టర్‌ వ్యాఖ్యలు వైరల్‌ | Sai Abhyankkar Comments On Raaka Movie Music | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left_article_page

<!-- article right pillar ad-->
<div class="skyscraper_ad right" id="div-gpt-ad-1713538770134-0">
   <div class="inner_skyscraper">
       <script>
                                if (!window.mobileCheck()) {   googletag.cmd.push(function() { googletag.display('div-gpt-ad-1713538770134-0'); }); }
                                   </script>
   </div>
</div>

రాకా మ్యూజిక్‌ ఇంటర్నేషనల్‌.. డైరెక్టర్‌ వ్యాఖ్యలు వైరల్‌

Apr 21 2026 8:52 AM | Updated on Apr 21 2026 9:04 AM

Sai Abhyankkar Comments On Raaka Movie Music

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ -  దర్శకుడు అట్లీ సినిమా రాకా.. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి బన్నీ ఫస్ట్‌ లుక్‌ విడుదల చేయడంతో భారీ అంచనాలు ఉన్నాయి.  ఈ క్రమంలో తాజాగా చిత్ర సంగీత దర్శకుడు సాయి అభ్యంకార్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఈ మూవీలో సంగీతం ఎలా ఉండబోతుందో ఆయన పేర్కొన్నారు. రాకా సినిమా కోసం మొదటిసారి దర్శకుడు అట్లీని కలిసినప్పుడు జరిగిన సంఘటనను ఆయన మరోసారి గుర్తుచేసుకున్నారు.

రాకా సినిమా సంగీతం విషయంలో దర్శకుడు అట్లీకి క్లియర్‌ విజన్‌ ఉందని సాయి అభ్యంకార్‌ ఇలా చెప్పారు. 'రాకా కోసం సౌండ్‌ ట్రాక్‌ ఎలా ఉండాలని అట్లీ ముందే చెప్పారు. అందుకు అనుగుణంగానే ఇప్పటికే మేము చాలా పాటలను క్రియేట్‌ చేశాం. అవన్నీ కూడా బాగానే వచ్చాయి. అల్లు అర్జున్‌ సార్‌కు సంగీతం అంటే చాలా ఇష్టం. రాకా పాటలు, సంగీతం అంతర్జాతీయ స్థాయిలో మెప్పించాలని అందుకు తగ్గట్టుగానే అంతర్జాతీయ గాయకులు, గీత రచయితలతో కలిసి పనిచేయాలని  కోరుకున్నాము. ప్రతి ట్రాక్‌లో మ్యూజిక్‌ బలంగా ఉండాలని ప్లాన్‌ చేశాం. అట్లీ అన్న కథ చెప్పిన తర్వాత, ఈ ఆల్బమ్‌ను ఎలా తీసుకురావాలనే దానిపై నాకు చాలా క్లారిటీ లభించింది.

వెయ్యికి పైగా పాటలు తన వద్ద ఉన్నాయని సంగీత దర్శకుడు సాయి అభ్యంకార్‌ తెలిపారు. ప్రముఖ గాయకులు టిప్పు- హరిణి కుమారుడిగా ఎంట్రీ ఇచ్చిన సాయి.. డ్యూడ్‌ మూవీతో తెలుగు వారిని మెప్పించాడు. రాకాతో పాటు సూర్య కరుప్పు, బెంజ్‌, మార్షల్‌, డీ 55 వంటి ప్రాజెక్ట్‌లకు ఆయన పనిచేస్తున్నాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement