'సక్సెస్‌'కి సరైన నిర్వచనం ఇదే..! తొలిసారిగా పేరెంట్స్‌ని.. | Founder takes parents on their first international trip goes viral | Sakshi
Sakshi News home page

'సక్సెస్‌'కి సరైన నిర్వచనం ఇదే..! తొలిసారిగా పేరెంట్స్‌ని..

Jun 4 2026 2:19 PM | Updated on Jun 4 2026 2:23 PM

Founder takes parents on their first international trip goes viral

మన సక్సెస్‌ కోసం అహర్నిశలు కష్టపడ్డ పేరెంట్స్‌కి తిరిగి ఏదైన ఇవ్వగలిగడం కంటే మించిన విజయం ఇకొంకటి ఉండదు. ఈ కల కోసం అంతా ప్రయత్నిస్తుంటారు. కొందరికీ ఏవేవో కారణాల వల్ల కుదరకపోవచ్చు. కానీ కొందరు అనుకున్నది సాధించి విజయానికి అసలైన నిర్వచనం ఇస్తుంటారు. అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది.

అభిషేక్ ఝా అనే వ్యవస్థాపకుడు ఏళ్లుగా ఈ కలం కోసం ఎదురు చూస్తున్నా అంటూ వివరిస్తుండటం వీడియోలో చూడొచ్చు. భావోద్వేగభరితమైన ఆ వీడియో క్లిప్‌లో తన తలిద్రండులను మొదటిసారి విదేశాలకు తీసుకువెళ్తున్నా అంటూ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఆ సతోషాన్ని పంచుకోవడం స్పష్టంగా కనిపిస్తుంది. అతను ఆ వీడియోలో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చాడు. 

"ఎయిర్‌పోర్ట్‌లోని ఇమ్మిగ్రేషన్‌ అధికారి ఎందుకింత సంతోషంగా ఉన్నారని అడిగాడు. అందుకు తాను జీవితంలో విజయం సాధించిన మొదటి క్షణం ఇది. ఈ రోజు తొలిసారి తన తల్లిదండ్రులని ఒక అంతర్జాతీయ పర్యటనకు తీసుకువెళ్తున్నా. ఇదంతా తనకెలా అనిపిస్తుందో మాటల్లో చెప్పలేను. నాతో కలిసి దేశం బయటకు అడుగు పెట్టడం ఇదే మొదటిసారి. వాళ్లు తమ కూమారుడు వారికోసం సంపాదించిన ప్రపంచాన్ని చూడనున్నారు. అయినా ఈ సంతోషం అంతా గెలిచిన వారికే దక్కుతుంది మిత్రమా. 

కాబట్టి ప్రతి ఒక్కరూ తమ పేరెంట్స్‌ కోసం విజేతగా నిలవాలి. అంటూ అభిషేక్‌ తన పోస్ట్‌ని ముగించాడు. అంతేగాదు ఆ వీడియోకి ‘తన తల్లిదండ్రులకు ప్రపంచాన్ని ఇవ్వాలని కలలు కన్న ఆ 16 ఏళ్ల అభిషేక్ ఝా కోసం..’ అనే క్యాప్షన్‌ జోడించి మరి పోస్ట్‌ చేశాడు. నెటిజన్లు కూడా ఇది నిజమైన విజయానికి నిర్వచనం, తల్లిదండ్రులను గర్వపడేలా చేయడం కంటే మించిన అనుభూతి మరొకటి లేదు అని కొందరు, మీ పేరెంట్స్‌ ముఖాల్లో చిరునవ్వు వాళ్లు చేసిన ప్రతికష్టానికి దక్కిన ప్రతిఫలం అని మరికొందరు ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.

 

(చదవండి: సినిమా సీన్‌ని తలపించేలా.. ఆర్మీ పైలట్‌ లవ్‌ ప్రపోజ్‌!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement