డిగ్రీ ఓకే.. స్కిల్స్‌ డబుల్‌ ఓకే..! | Degree Get A Job Skills Build A Career | Sakshi
Sakshi News home page

డిగ్రీ ఓకే.. స్కిల్స్‌ డబుల్‌ ఓకే..!

Jul 24 2026 12:47 PM | Updated on Jul 24 2026 12:51 PM

Degree Get A Job Skills Build A Career

కెరియర్‌

జాగో జెన్‌ జీ..

ష్టపడి డిగ్రీ చదివేస్తే సరిపోదు.. రియల్‌ వరల్డ్‌లో పోటీకి తగినట్టు స్కిల్స్‌ పెంచుకోకపోతే వెనుకపడిపోతావ్‌.. మహా అయితే నీ డి గ్రీ ఒక్క ఉద్యోగాన్నిస్తుంది. కాని స్కిల్స్‌ ఉంటే కెరీర్‌ మలుపు తిరుగుతుంది.

ఏఐ నీ శత్రువు కాదు
ప్రస్తుతం అంతా ఏఐ మాయలో ప్రపంచమంతా పయనిస్తోంది. దాని వల్ల వేలమందికి ఉద్యోగాలు పోయాయి..మరిన్ని లక్షల మందికి ఉద్యోగాలు పోనున్నాయి. కాని ఏఐ నీ శత్రువు కాదు. ఏఐ వాడగలిగేవాడు నీ ఉద్యోగాన్ని తీసుకుంటాడంతే...

సోషల్‌ మీడియాతో స్నేహం చాలదు..
రీల్స్‌ చూస్తూ, వీడియోలు షేర్‌ చేయడం మానేసి కంటెంట్‌ క్రియేటర్‌గా ఎదుగు.. యూట్యూబ్‌ ఛానల్, ఇన్‌స్టా రీల్, ఇన్‌ఫోటెయిన్‌మెంట్, బ్లాగ్స్‌ ఇలా నీ ట్యాలెంట్‌కి సూట్‌ అయ్యే ప్లాట్‌ఫాం ఎంచుకో. విస్తారమైన అవకాశాలు ఉన్నది ఒక్క సోషల్‌ మీడియాలోనేనని తెలుసుకో...

జీతం కోసం కాదు జీవితం కోసం చూడు
ఏదో ఒక పని చేసి నెలజీతం తెచ్చుకుంటే చాలనుకోకు..ప్రభుత్వాలు మారినా, షేర్‌ మార్కెట్లు కుప్పకూలినా, కంపెనీలు దివాల తీసినా ముందుగా మూడేది నెలజీతగాళ్లకే...అందుకే నైపుణ్యాలు పెంచుకో బంగారు భవితని గెలుచుకో.

భర్తీ కానివ్వకు..
అందరూ చేసే పనిని నువ్వు చేయకు.. నీ ప్రత్యేకత ఉన్న పనేంటో శోధించి దానిలో ప్రతిభ చూపించి రాణించు..నిన్ను భర్తీ చేసి వేరొకరికి నీ స్థానాన్నివ్వాలన్న ఆలోచనని రానివ్వకు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement