సినిమా సీన్‌ని తలపించేలా.. ఆర్మీ పైలట్‌ లవ్‌ ప్రపోజ్‌! | Army pilot proposes to girlfriend in front of helicopter Goes Viral | Sakshi
Sakshi News home page

సినిమా సీన్‌ని తలపించేలా.. ఆర్మీ పైలట్‌ లవ్‌ ప్రపోజ్‌!

Jun 3 2026 1:00 PM | Updated on Jun 3 2026 1:06 PM

Army pilot proposes to girlfriend in front of helicopter Goes Viral

రెండు ఆనందాలు ఒకేసారి వస్తే ఆ ఫీలే వేరేలెవెల్‌. అందులోనూ తన కిష్టమైన వ్యక్తిని సర్‌ప్రైజ్‌ చేసేలా ఏదో ఒకటి చేస్తుంటారు. కానీ ఇలా వృత్తిపరమైన వైలురాయిని వ్యక్తిగత విజయాన్ని జరుపుకుంటే అక్కడే చూసేవాళ్లకు సైతం ఆశ్చర్యం ఆనందం ఒకేసారి వస్తాయి కదూ. అలాంటి అందమైన సందర్భమే నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోని చూసి నెటిజన్లు బ్యూటిఫుల్‌ ప్రపోజ్‌ బ్రో అంటూ ప్రశంసిస్తున్నారు.

భారత సైన్యపు ఏవియేషన్‌ గ్రాడ్యుయేషన్ వేడుకలో జరిగిన అందమైన ప్రపోజల్‌ వీడియో అందర్నీ అమితంగా ఆకర్షిస్తోంది.  మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న కాంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్ (CAATS)లో తన ఫ్లైట్ శిక్షణను పూర్తి చేసుకున్న తర్వాత భారత సైన్యపు ఏవియేషన్ కెప్టెన్ భరత్ భరద్వాజ్ తన ప్రియురాలు ఆరుషికి ఆశ్చర్యపోయేలా ప్రపోజ్‌ చేశాడు. ఆ అనూహ్యమైన పనికి ఆరుషి ఒక్కసారిగా విస్తుపోతూ అతడి ప్రపోజల్‌ని యాక్సెప్ట్‌ చేసింది. 

తన కుటుబం సభ్యులు, అధికారులు, శిక్షకులు, అతిథుల చప్పట్లు, కేరింతలు హోరెత్తిస్తుండగా చేసిన ప్రపోజల్‌ ఆమెకు ఎప్పటి మర్చిపోరాని జ్ఞాపకంలా అందించాడు ఆర్మీ పైలట్‌ భరత్‌. ఈ మేరకు ఈ వీడియోని షేర్‌ చేస్తూ..భరత్‌ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చాడు. మేమంతా ఈ రోజు పైలట్లుగా, శిక్షకులుగా మారం. 

ఇది మా అందరికీ అతి ముఖ్యమైన రోజు. మా కష్టానికి ఈ రోజు ఫలితం దక్కింది. గత ఐదేళ్లుగా ఒకరికొకరం తెలుసు. ఆమెకు ఇలా పెళ్లి ప్రతిపాదన చేయడానికి ఇంతకంటే మంచి రోజు మరొకటి ఉండదని అనుకుంటున్నా. నా కుటుంబానికి, కాబోయే భార్యకు ఈ రోజు చిరస్మరణీయంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఇలా చేశా అని పేర్కొన్నాడు కెప్టెన్‌ భరద్వాజ్‌.

 

(చదవండి: విదేశీ పర్యాటకుడి గొప్ప మనసు..! ఉత్తరాఖండ్‌లో..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement