బుడ్డోడా మజాకా.. సవతి సోదరుడైనా తమ్ముడంటే ప్రాణం! | Lamine Yamal-Half-Brother-Keyne-Celebrations-Spain-Won FIFA WC 2026 | Sakshi
Sakshi News home page

బుడ్డోడా మజాకా.. సవతి సోదరుడైనా తమ్ముడంటే ప్రాణం!

Jul 20 2026 7:31 PM | Updated on Jul 20 2026 7:45 PM

Lamine Yamal-Half-Brother-Keyne-Celebrations-Spain-Won FIFA WC 2026

Photo Credit: FIFA Twitter

ఫిఫా ప్రపంచకప్ విజేతగా స్పెయిన్ నిలవడంతో ఆ జట్టు సంబరాలు మాములుగా లేవు. 16 ఏళ్ల తర్వాత రెండోసారి ఫిఫా టైటిల్ గెలవడంతో స్పెయిన్‌లో సంబురాలు అంబరాన్ని అంటాయి. ఇక స్పెయిన్ ఆటగాళ్ల ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి. అయితే ఈ ఫిఫా టోర్నీలో ఒక బుడ్డోడు మాత్రం యమా క్రేజ్ సంపాదించాడు. 

ఆ బుడ్డోడు ఎవరో కాదు స్పెయిన్ స్టార్ లామినె యమాల్ చిన్న తమ్ముడు కీన్. సవతి తల్లికి పుట్టినోడయినప్పటికీ కీన్‌ను యమాల్‌ సొంత తమ్ముడిలా, కొడుకులా భావిస్తుంటాడు. మూడేళ్ల వయసున్న కీన్ 2026 ఫిఫా ప్రపంచకప్‌లో స్పెయిన్ ఆడిన ప్రతీ మ్యాచ్‌కు తన తల్లితో కలిసి హాజరయ్యాడు. ప్రతీ మ్యాచ్‌ను ‍స్టాండ్స్ నుంచి వీక్షించిన కీన్ తన అన్న ఆటను తెగ ఎంజాయ్ చేసేవాడు. 


Photo Credit: FIFA Twitter

అంతేకాదు స్పెయిన్ తాము ఆడిన ప్రతీ మ్యాచ్‌లో విజయం సాధించిన తర్వాత యమాల్ తన సోదరుడిని ఒడిలో తీసుకొని ఆడుకోవడం ఆనవాయితీగా చేసుకున్నాడు. ఫైనల్ మ్యాచ్ తర్వాత కూడా యమాల్ దీనిని కంటిన్యూ చేశాడు. తన అన్న కప్ గెలవడంతో తమ్ముడికి సంతోషం ఆగలేదు. గ్రౌండ్ అంతా తనదే అన్నట్లుగా మైదానం నలుమూలలా పరిగెడుతూ సందడి చేశాడు. 


Photo Credit: FIFA Twitter

ఈ సందర్భంగా అన్న లామినె యమాల్‌ను కూడా కాసేపు ఆట పట్టించాడు. ట్రోఫీ సెలబ్రేషన్స్ అనంతరం కప్పు తన చేతిలోకి తీసుకున్న యమాల్ తన కుటుంబం దగ్గరకు వచ్చి తమ్ముడితో కలిసి ఫొటోలుకు ఫోజివ్వడం వైరల్‌గా మారింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఫిఫా పైనల్‌ మ్యాచ్‌లో స్పెయిన్‌ 1-0 తేడాతో అర్జెంటీనాపై విజయం సాధించి ట్రోఫీని అందుకుంది.

 

 

 

చదవండి: దేశవాళీ టోర్నీ.. సూర్యకుమార్‌కు మరో అవమానం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement