దేశవాళీ టోర్నీ.. సూర్యకుమార్‌కు మరో అవమానం! | Selectors Ignored-Suryakumar-Not-Selected-West-Zone-Duleep Trophy | Sakshi
Sakshi News home page

దేశవాళీ టోర్నీ.. సూర్యకుమార్‌కు మరో అవమానం!

Jul 20 2026 6:38 PM | Updated on Jul 20 2026 8:58 PM

Selectors Ignored-Suryakumar-Not-Selected-West-Zone-Duleep Trophy

Photo Credit: BCCI Twitter

దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోపీకి సంబంధించి వెస్ట్‌జోన్ జ‌ట్టును బీసీసీఐ సోమ‌వారం ప్ర‌క‌టించింది. ఈ వెస్ట్‌జోన్‌కు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా వ్య‌వ‌హరించ‌నుండ‌గా, షామ్స్ ములానీ వైస్ కెప్టెన్‌గా, ఉర్విల్‌ప‌టేల్‌, హార్విక్ దేశాయ్‌ల‌ను వికెట్ కీప‌ర్లుగా ఎంపిక‌య్యారు. ఇక రిజ‌ర్వ్ ప్లేయ‌ర్లుగా జ‌య్ గోహిల్‌, ఆర్యా దేశాయ్‌, అర్షిన్ కుల‌క‌ర్ణి, విజ‌య్ జైస్వాల్‌, రాజ్‌వ‌ర్ద‌న్ హంగ్రేక‌ర్‌లకు చోటు ద‌క్కింది.

అయితే భార‌త స్టార్ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ టోర్నీలో ఆడ‌తాడ‌ని అంతా భావించారు. కానీ సెలెక్ట‌ర్లు అత‌డిని దులీప్ ట్రోఫీకి ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు. శ్రీలంక‌తో టెస్టు సిరీస్ ఉన్న కార‌ణంగానే జైస్వాల్‌ను ఎంపిక చేయ‌లేద‌ని తెలుస్తోంది. ఇక జైస్వాల్‌తో పాటు టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌, సూర్య‌కుమార్ యాదవ్‌ల‌ను కూడా ప‌క్క‌న‌బెట్టారు. 

అయితే శ్రేయ‌స్ అయ్య‌ర్ ప్ర‌స్తుతం ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌లోనే ఎక్కువ‌గా ఆడుతున్నాడు. వెన్నునొప్పి కార‌ణంగా చాలా సేపు బ్యాటింగ్ చేయాల్సిన టెస్టు ఫార్మాట్‌కు దూరంగానే ఉంటున్నాడు. ఇక టీమిండియాలో చోటు కోల్పోయిన‌ సూర్య‌కుమార్ యాద‌వ్ కూడా ప్ర‌స్తుతం రీఎంట్రీ ఇవ్వాల‌ని చూస్తున్నాడు. 

దులీప్ ట్రోఫీని అందుకు అనుకూలంగా మార్చుకోవాల‌నుకున్న‌ప్ప‌టికీ, అత‌డిని ఎంపిక చేయ‌లేదు. దీంతో 2026-27 రంజీ సీజ‌న్‌లో ముంబై త‌ర‌ఫున సూర్యకుమార్ ఆడాల‌ని భావిస్తున్నాడు. ఇక మ‌రో సీనియ‌ర్ అజింక్య ర‌హానేను కూడా సెలెక్ట‌ర్లు ప‌క్క‌న‌బెట్టారు. టీమిండియా ఫ్యూచ‌ర్ క్రికెట్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

వెస్ట్ జోన్‌ జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), షమ్స్ ములానీ (వైస్ కెప్టెన్), హార్విక్ దేశాయ్ (వికెట్‌ కీపర్‌), ఉర్విల్ పటేల్ (వికెట్‌ కీపర్‌), జయమీత్ పటేల్, పృథ్వీ షా, శివాలిక్ శర్మ, సిద్ధార్థ్ దేశాయ్, సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్, అతిత్ షేత్, ముఖేష్ చౌదరి, తనుశ్ కొటియన్‌, శార్దూల్ ఠాకూర్‌, తుషార్ దేశ్‌పాండే

రిజర్వ్ ప్లేయర్లు: జే గోహిల్, ఆర్య దేశాయ్, అర్షిన్ కులకర్ణి, మహేష్ పిథియా, విశాల్ జైస్వాల్ మరియు రాజవర్ధన్ హంగర్గేకర్.

చదవండి: మెస్సీ అలా.. లామినే ఇలా; చివ‌రికి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement