బెన్ స్టోక్స్ అదిరిపోయే రీఎంట్రీ.. సూపర్‌ శతకం | Ben Stokes hits century for Durham in first game back after announcing England retirement | Sakshi
Sakshi News home page

బెన్ స్టోక్స్ అదిరిపోయే రీఎంట్రీ.. సూపర్‌ శతకం

Jul 22 2026 10:08 AM | Updated on Jul 22 2026 12:32 PM

Ben Stokes hits century for Durham in first game back after announcing England retirement

pic credit: the times

ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ పోటీ క్రికెట్‌లోకి ఘనంగా తిరిగొచ్చాడు. టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మూడు వారాల తర్వాత వన్డే కప్‌ (ఇంగ్లండ్‌) బరిలోకి దిగిన స్టోక్స్.. డర్హమ్ తరఫున అజేయ శతకంతో అదరగొట్టాడు. 

దాదాపు 12 ఏళ్ల తర్వాత డర్హమ్ తరఫున లిస్ట్-ఏ మ్యాచ్ ఆడిన స్టోక్స్, డెర్బీషైర్ నిర్దేశించిన 257 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అజేయంగా 108 పరుగులు (10 ఫోర్లు, 3 సిక్సర్లు) చేశాడు.

ఇన్నింగ్స్ మొత్తం తీవ్ర కండరాల నొప్పి (క్రాంప్స్)తో ఇబ్బంది పడినప్పటికీ, పోరాట పటిమను ప్రదర్శిస్తూ చివరి వరకు క్రీజ్‌లో నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

అంతకుముందు బౌలింగ్‌లోనూ స్టోక్స్ తొమ్మిది ఓవర్లు వేసి వికెట్లు తీయకపోయినా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. డెర్బీషైర్ 9 వికెట్లకు 256 పరుగులు చేసింది. మార్టిన్ ఆండర్సన్ (112) అద్భుత శతకం సాధించి జట్టుకు పోటీ స్కోరు అందించాడు.

లక్ష్య ఛేదనలో డర్హమ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. బెన్ ఐచిసన్ రెండు వికెట్లు తీయడంతో ఆ జట్టు ఒత్తిడిలో పడింది. అయితే స్టోక్స్, విల్ రోడ్స్ (45)తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. అనంతరం కొలిన్ అకర్‌మన్, ఒల్లీ రాబిన్సన్ కూడా విలువైన పరుగులు జోడించారు.

అర్ధశతకం తర్వాత క్రాంప్స్‌తో మైదానంలోనే కుప్పకూలిన స్టోక్స్, నొప్పిని తట్టుకుని మళ్లీ బ్యాటింగ్ కొనసాగించాడు. చివరకు శతకం పూర్తి చేసి అజేయంగా నిలిచి డర్హమ్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement