న్యూఢిల్లీ: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ పంజాబ్‌కు చెందిన వందలాది మంది రైతులు ఢిల్లీకి చేరుకున్నారు. నేడు కిసాన్ ఘాట్‌లో ‘దేశ్ బచావో మోర్చా’ ఆధ్వర్యంలో జరిగే ‘మహా పంచాయత్’లో వీరంతా పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 550 రైతు సంఘాలు, సామాజిక సంస్థలు ఈ నిరసనలో పాల్గొంటున్నాయని నిర్వాహకులు తెలిపారు.
ఈ ఒప్పందం వల్ల భారత రైతులు, కూలీలు, చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారని కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ (కేఎంఎస్‌సీ) నేత జర్మన్‌జిత్ సింగ్ బండాల ఆరోపించారు. అమెరికాలో భారీ సబ్సిడీలతో వేలాది ఎకరాల్లో వ్యవసాయం జరుగుతోందని, కానీ మన దేశంలో మెజారిటీ రైతులకు కేవలం 2 నుంచి 2.5 ఎకరాల భూమి మాత్రమే ఉందనని ఆయన గుర్తుచేశారు. ఈ ఒప్పందంతో చౌకైన అమెరికా వ్యవసాయ దిగుమతులు దేశీయ మార్కెట్లోకి వస్తే, చిన్న రైతులు పోటీ పడలేరని ఆందోళన వ్యక్తం చేశారు.
#WATCH आज दिल्ली की ओर अपने तय मार्च से पहले बड़ी संख्या में किसान शंभू बॉर्डर (पंजाब-हरियाणा बॉर्डर) पहुंचे। वीडियो पटियाला (पंजाब) से है। pic.twitter.com/OWxjTRNj4v
— ANI_HindiNews (@AHindinews) July 21, 2026
అమెరికా ఒత్తిడికే కేంద్ర ప్రభుత్వం తలొగ్గి ఈ ఒప్పందాన్ని ముందుకు తెస్తోందని ఆయన విమర్శించారు. కేవలం వ్యవసాయమే కాకుండా, చిన్న వ్యాపారాలు, ఇతర రంగాల్లోని ఉద్యోగాలపై కూడా ఈ ప్రభావం పడుతుందన్నారు. డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: అంతర్జాతీయ వేదికపై పాక్ పరువు పాయే!


