సిగరెట్లు తాగేవారు చెప్పే సాకులు వింత వింతగా ఉంటాయి. రోజూ తాగను, ఎక్కువగానూ, తాగను, ఏదో అప్పుడప్పుడు, వీకెండ్‌లోనో, ఏ పార్టీలోనో, లేదా మూడ్ బాగా లేనప్పుడు మాత్రమే తాగుతాను అని చెబుతుంటారు. ఎందుకంటే చాలా ఏళ్ల నుంచి లేదా ప్రతిరోజూ సిగరెట్లు కాల్చే వ్యక్తుల్లో మాత్రమే అనారోగ్య సమస్యలుంటాయని నమ్ముతారు.కానీ అలాంటి వారికి ఇదొక హెచ్చరిక. అప్పుడప్పుడు ధూమపానం చేసే వారిలో కూడా పలు అనారోగ్య ప్రమాదాన్ని పెంచుతాయని ఆధారాలు సూచిస్తున్నాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా మరణాలకు పొగాకు ప్రధాన కారణాలలో ఒకటి. దీనివల్ల ప్రతి ఏడాది 80 లక్షలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. వీటిల్లో ఎక్కువ, ధూమపానం కారణంగా వచ్చే శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్లతో ముడిపడి ఉన్నాయి. పొగాకు పొగలో 7వేలకు పైగా ఎక్కువ రసాయనాలు ఉంటాయి, వీటిలో క్యాన్సర్‌కు కారణమయ్యేవిగా తెలిసిన అనేక పదార్థాలు విష పదార్థాలు కూడా ఉన్నాయి. దీని ప్రభావం విషయంలో రోజూ సిగరెట్ తాగేవారికి అప్పుడప్పుడు తాగే వారికి మధ్య పెద్ద తేడా ఉండదు.
గుండె, రక్తనాళాలపై ప్రభావం
హృదయనాళ వ్యవస్థ పొగాకు పొగ ప్రభావానికి తొందరగా లోనవుతుంది. పొగత్రాగడం మొదలుపెట్టిన కొద్ది నిమిషాలకే, నికోటిన్ రక్తనాళాలు సన్నబడటానికి, హృదయ స్పందన రేటు పెరగడానికి , రక్తపోటు పెరగడానికి కారణమవుతుంది. కార్బన్ మోనాక్సైడ్ రక్తంలో ఆక్సిజన్ పరిమాణాన్ని తగ్గిస్తుంది, దీనివల్ల గుండె మరింత కష్టపడాల్సి వస్తుంది.
పొగత్రాగని వారితో పోలిస్తే, రోజుకు కొన్ని సిగరెట్లు మాత్రమే తాగే వారికి కూడా గుండె జబ్బుల ప్రమాదం గణనీయంగా ఎక్కువగా ఉంటుందని పరిశోధనలో తేలింది.
గుండెపోటు ప్రమాదం పెరగడం
అంగ స్తంభనలో సమస్యలు
రక్తనాళాల లోపలి పొర దెబ్బతినడం
ధమనులలో అడ్డంకులు వేగంగా ఏర్పడటం
రక్తంలో గడ్డలు ఏర్పడే అవకాశం పెరగడం
అంతేకాదు ఈ ముప్పు, మనలో ఎలాంటి లక్షణాలు కనిపించడానికంటే ముందే మన శరీరంలో ప్రారంభం కావచ్చు.
ఊపిరితిత్తులపై ప్రభావాలు
ప్రతిసారి పొగ పీల్చినప్పుడు ఊపిరితిత్తులు నేరుగా ప్రభావితమవుతాయి. అడపాదడపా గురైనప్పటికీ అది శ్వాసనాళాలను చికాకు పెట్టి, వాపుకు గురిచేస్తుంది. అప్పుడప్పుడు ధూమపానం చేసే చాలామంది ఈ క్రింది లక్షణాలను కనిపిస్తాయి.
నిరంతర దగ్గు, ఆయాసం,
శారీరక శ్రమ సమయంలో ఆయాసం,
తరచుగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు
క్యాన్సర్ ప్రమాదం
ధూమపానానికి, క్యాన్సర్‌కు మధ్య ఉన్న సంబంధం అత్యంత ఆందోళనకరమైన అంశాలలో ఒకటి. అప్పుడప్పుడూ సిగరెట్ తాగినా, కూడా పొగాకు పొగలో ఉండే క్యాన్సర్ కారకాలు, DNAను దెబ్బస్తాయి. ఈ నష్టం కాలక్రమేణా పేరుకుపోయి, అసాధారణ కణాల పెరుగుదల సంభావ్యతను పెంచుతుంది.
ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణ , ప్రాణాంతక క్యాన్సర్లలో ఒకటిగా కొనసాగుతోంది. అప్పుడప్పుడు ధూమపానం చేసేవారికి, నిరంతరం ధూమపానం చేసేవారితో పోలిస్తే ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం గణనీయంగా ఎక్కువగా ఉందని అధ్యయనాలు కనుగొన్నాయి.
నోట్: ధూమపానం ప్రాణానికి ప్రమాదం. అంతేకాదు సిగరెట్ తాగడం వల్ల, మనతోపాటు, మన చుట్టుపక్కల ఉన్నవారిని ప్రమాదంలోపడవేస్తున్నామనే విషయాన్ని గ్రహించాలి. ఇది ప్రకృతికి కూడా చాలా చేటు. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండండి.


