'డ్యూడ్' కాంబో రిపీట్.. కొత్త సినిమాకు ఏకంగా ఆరుగురు డైరెక్టర్లు | Pradeep Ranganathan New Movie Announcement Latest | Sakshi
Sakshi News home page

Pradeep Ranganathan: నిర్మాతగానూ ప్రదీప్ రంగనాథన్.. అనౌన్స్‌మెంట్ వీడియో

Jul 6 2026 10:52 AM | Updated on Jul 6 2026 11:04 AM

Pradeep Ranganathan New Movie Announcement Latest

లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకుని.. వీటన్నింటితోనూ చెరో రూ.100 కోట్ల కలెక్షన్స్ అందుకున్న తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్.. రీసెంట్ టైంలో 'ఎల్ఐకే' మూవీతో తొలి ఫ్లాప్ చూశారు. దాని సంగతి పక్కనబెడితే తాను హీరోగా చేయబోతున్న కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. ఈ మేరకు అనౌన్స్‌మెంట్ వీడియో రిలీజ్ చేశాడు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

హీరో కాకముందు ప్రదీప్ రంగనాథన్.. షార్ట్ ఫిల్మ్స్ తీశాడు. 'కోమలి' మూవీతో దర్శకుడిగా మారాడు. 'లవ్ టుడే' చిత్రానికి కూడా ఇతడే దర్శకుడు. మళ్లీ చాన్నాళ్ల తర్వాత తన మూవీ తానే స్టోరీ రాశాడు. అదే ఈ ప్రాజెక్ట్. దీనితోనే నిర్మాతగానూ మారాడు. తన దగ్గర పనిచేసిన ఆరుగురు కుర్రాళ్లని 'ద ఆల్ఫా టీమ్' మార్చి దీనికి దర్శకత్వ బాధ్యతలు అప్పగించాడు.

ఇకపోతే ఈ మూవీలో 'డ్యూడ్' కాంబో రిపీటైంది. ప్రదీప్ రంగనాథన్-మమిత బైజు హీరోహీరోయిన్లుగా కాగా లేటెస్ట్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతమందిస్తున్నాడు. తెలుగు నటుడు శివాజీతో పాటు శ్వాసిక, అశ్వత్ మారిముత్తు కీలక పాత్రలు చేయనున్నారు. అనామిక మహి అనే అమ్మాయిని ఈ మూవీతో హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

(ఇదీ చదవండి: అ‍ప్పుడు నేను ముఖ్యమంత్రి అవుతా: కమల్ హాసన్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement