ఆరో క్లాస్ నుంచి చేస్తున్నా.. నా దగ్గర 1000 పాటలున్నాయి | Sai Abhyankkar Had 1000 Songs And Composing Since 6th Class | Sakshi
Sakshi News home page

Sai Abhyankkar: నాకు 60 ఏళ్లొచ్చినా తర్వాతే ఆ పాటలన్నీ వాడుతా

Apr 21 2026 12:51 PM | Updated on Apr 21 2026 1:09 PM

Sai Abhyankkar Had 1000 Songs And Composing Since 6th Class

సాయి అభ్యంకర్.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు కూడా కాస్త సుపరిచతమే. ఎందుకంటే రీసెంట్ టైంలో తన పాటలతో సంచలనం సృష్టిస్తున్నాడు. గతేడాది రిలీజైన 'డ్యూడ్' మూవీ సాంగ్స్ కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఇతడే. ప్రస్తుతం అల్లు అర్జున్, సూర్య లాంటి స్టార్ హీరోల సినిమాలకు పనిచేస్తున్న ఇతడు.. అందరూ అవాక్కయ్యే విషయాన్ని బయటపెట్టాడు. తన దగ్గర ప్రస్తుతం వెయ్యకి పైగానే పాటలు సిద్ధంగా ఉన్నాయని షాకిచ్చాడు.

(ఇదీ చదవండి: 'రాకా' మ్యూజిక్‌ ఇంటర్నేషనల్‌.. సాయి వ్యాఖ్యలు వైరల్‌)

'నేను ఆరో తరగతిలో ఉన్నప్పటి నుంచి సంగీతం ప్రాక్టీస్ చేస్తున్నా. పాటల్ని కంపోజ్ చేస్తున్నా. ఇప్పటికే నా దగ్గర 1000కి పైగా పాటలు రెడీగా ఉన్నాయి. కాకపోతే వాటిని ఇప్పుడు ఉపయోగించను. నాకు 60 ఏళ్లు దాటిన తర్వాత ఆ పాటల్ని బయటకు తీస్తా. ఇప్పుడు నేను పెద్ద సినిమాలు చేస్తున్నాను. కాబట్టి వాటిపై ఆధారపడటం కంటే కొత్తగా పాటలు కంపోజ్ చేయాలి' అని సాయి అభ్యంకర్ చెప్పుకొచ్చాడు.

ఎన్నో పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సింగర్స్ టిప్పు-హరిణిల కొడుకే ఈ సాయి అభ్యంకర్. సొంతంగా ఆల్బమ్ సాంగ్స్ చేసి ఫేమస్ అయిన ఇతడు.. ప్రస్తుతం తెలుగు, తమిళంలో స్టార్ హీరోల సినిమాలకు పనిచేస్తున్నాడు. తమిళంలో అయితే అనిరుధ్‌కి సాయి పోటీ వచ్చాడని మాట్లాడుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఇతడి మ్యూజిక్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement