tamil music composer
-
స్టూడియోలో నాపై లైంగిక దాడి.. సీసీటీవీ వీడియోలతో బ్లాక్మెయిల్
మహిళా గాయని స్వాగత కృష్ణన్.. తమిళ ప్రముఖ సంగీత దర్శకుడిపై సంచలన ఆరోపణలు చేసింది. తనపై లైంగిక దాడి చేశాడని, చేసిన పనికి రెమ్యునరేషన్ ఇవ్వకుండా మోసం చేశాడని తన బాధ చెప్పుకొంది. పైగా అప్పుల్లో ఉన్నానని చెప్పి తన దగ్గరే పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని ఎగ్గొట్టాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సంఘటన వల్లే ఇండస్ట్రీని తాను వదిలేశానని, సదరు మ్యూజిక్ డైరెక్టర్ని 'ఎప్స్టీన్ ఆఫ్ మద్రాస్' అని పేరు పెట్టింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సంగతులు చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ‘స్పిరిట్’ సినిమా కోసం గొర్రెలు అమ్ముకున్నాం.. చాలా కష్టపడ్డాం)'ఏడేళ్ల క్రితం చెన్నై వదిలిపెట్టి రిషికేష్ వెళ్లిపోవడం వెనక కారణం ఇప్పుడు బయటపెడుతున్నా. బ్రేకప్ అయిపోయి డిప్రెషన్లో ఉన్నప్పుడు నా జీవితంలోకి ఆ సంగీత దర్శకుడు వచ్చాడు. నా పరిస్థితిని తనకు అనుకూలంగా ఉపయోగించుకున్నాడు. మాయమాటలు చెప్పి తనపై నమ్మకం పెరిగేలా చేసి, గురువుగా నటిస్తూ దగ్గరయ్యాడు. కొన్నాళ్లకు అసలు రంగు బయటపెట్టాడు. కోరస్ కంపోజిషన్, మిక్సింగ్ లాంటివి చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు. కానీ నాకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వకుండా మోసం చేశాడు. మళ్లీ అప్పుల్లో ఉన్నానని చెప్పి నా దగ్గరే చాలా డబ్బులు తీసుకున్నాడు. వాటిని తిరిగివ్వలేదు''ఆయన స్టూడియో సౌండ్‌ప్రూఫ్‌గా ఉండేది. ఆ గది తలుపులు లాక్ చేసి బలవంతంగా నాపై లైంగిక దాడి చేశాడు. అక్కడే ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలతో ఇదంతా రికార్డ్ చేసి తర్వాత నన్ను బెదిరించాడు. ఈ ఘటన తర్వాత తిరిగి నాపైనే అబద్దాలు చెప్పడం, దొంగతనం లాంటి తప్పుడు ఆరోపణలు చేశాడు. ఇండస్ట్రీలో నా పేరు చెడగొట్టే ప్రయత్నం చేశాడు. దీంతో తీవ్రంగా మానసిక ఒత్తిడికి గురయ్యాను. కొంతకాలం ఒంటరిగా ఉండాల్సి వచ్చింది. చికిత్స కూడా తీసుకున్నా. అందుకే చెన్నై వదిలేసి రిషికేష్ వెళ్లిపోయి వ్యాపారం చేసుకుంటున్నా''ఈ మధ్యే మరో యువతి తనకు ఇలానే జరిగిందని నాతో చెప్పడంతోనే ఈ విషయం బయటపెట్టాలని నిర్ణయించుకున్నా. నేనే కాదు చాలామంది అమ్మాయిలు అతడి బాధితులే. భయం, ఎవరి సపోర్ట్ లేకపోవడం వల్ల అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కానీ ఇప్పుడు న్యాయపరంగా ముందుకెళ్తా. అయితే ఇది ఆయనపై ప్రతీకారం కాదు. ఇకపై నాలాగా మరెవరూ మానసిక వేదన అనుభవించకూడదనే ఉద్దేశంతోనే చేస్తున్నాను' అని సింగర్ స్వాగత కృష్ణన్ చెప్పుకొచ్చింది.'యెనో పెన్నే', 'కాదల్ కన్మణి' లాంటి పాటలు పాడిన ఈమె.. సదరు సంగీత దర్శకుడి పేరు మాత్రం బయటపెట్టలేదు. ఈమె సోదరి మాయ కృష్ణన్.. విక్రమ్, లియో సినిమాల్లో సహాయ పాత్రలు చేసింది తమిళ బిగ్‌బాస్ షోలోనూ పాల్గొంది.(ఇదీ చదవండి: అషుపై కేసు పెట్టాలనుకోలేదు.. కానీ ఆమె అలా చేసేసరికి: ధర్మేంద్ర) -
ఆరో క్లాస్ నుంచి చేస్తున్నా.. నా దగ్గర 1000 పాటలున్నాయి
సాయి అభ్యంకర్.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు కూడా కాస్త సుపరిచతమే. ఎందుకంటే రీసెంట్ టైంలో తన పాటలతో సంచలనం సృష్టిస్తున్నాడు. గతేడాది రిలీజైన 'డ్యూడ్' మూవీ సాంగ్స్ కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఇతడే. ప్రస్తుతం అల్లు అర్జున్, సూర్య లాంటి స్టార్ హీరోల సినిమాలకు పనిచేస్తున్న ఇతడు.. అందరూ అవాక్కయ్యే విషయాన్ని బయటపెట్టాడు. తన దగ్గర ప్రస్తుతం వెయ్యకి పైగానే పాటలు సిద్ధంగా ఉన్నాయని షాకిచ్చాడు.(ఇదీ చదవండి: 'రాకా' మ్యూజిక్ ఇంటర్నేషనల్.. సాయి వ్యాఖ్యలు వైరల్)'నేను ఆరో తరగతిలో ఉన్నప్పటి నుంచి సంగీతం ప్రాక్టీస్ చేస్తున్నా. పాటల్ని కంపోజ్ చేస్తున్నా. ఇప్పటికే నా దగ్గర 1000కి పైగా పాటలు రెడీగా ఉన్నాయి. కాకపోతే వాటిని ఇప్పుడు ఉపయోగించను. నాకు 60 ఏళ్లు దాటిన తర్వాత ఆ పాటల్ని బయటకు తీస్తా. ఇప్పుడు నేను పెద్ద సినిమాలు చేస్తున్నాను. కాబట్టి వాటిపై ఆధారపడటం కంటే కొత్తగా పాటలు కంపోజ్ చేయాలి' అని సాయి అభ్యంకర్ చెప్పుకొచ్చాడు.ఎన్నో పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సింగర్స్ టిప్పు-హరిణిల కొడుకే ఈ సాయి అభ్యంకర్. సొంతంగా ఆల్బమ్ సాంగ్స్ చేసి ఫేమస్ అయిన ఇతడు.. ప్రస్తుతం తెలుగు, తమిళంలో స్టార్ హీరోల సినిమాలకు పనిచేస్తున్నాడు. తమిళంలో అయితే అనిరుధ్‌కి సాయి పోటీ వచ్చాడని మాట్లాడుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఇతడి మ్యూజిక్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు) -
బీజేపీలోకి ప్రముఖ సంగీత దర్శకుడు
ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు, ఇళయరాజా సోదరుడు గంగై అమరన్ బీజేపీలో చేరబోతున్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆయన చేరనున్నట్లు సమాచారం. తొలిసారి తమిళనాడు పర్యటనకు వస్తున్న అమిత్ షా ఓ బహిరంగ సభలో పాల్గొంటున్న సందర్భంగా గంగై అమరన్‌ను చేర్చుకోడానికి తమిళనాడు బీజేపీ శ్రేణులు పూర్తిస్థాయిలో సన్నాహాలు చేసుకున్నాయి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావుతోను, తమిళనాడు శాఖ అధ్యక్షుడు తమిళసై సౌందరరాజన్తోను ఇప్పటికే అమరన్ మాట్లాడారు. ఇక గంగై అమరన్‌తో పాటు పలువురు ప్రముఖులు కూడా శనివారం నాడు జరిగే కార్యక్రమంలో కమలనాథుల దళంలో చేరుతారని బీజేపీ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. గంగై కేవలం సంగీతదర్శకుడే కాదు.. పాటల రచయిత, సినిమా నిర్మాతగా కూడా ఉన్నారు. రాష్ట్రంలో అన్నాడీఎంకే, డీఎంకేలకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు బీజేపీ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. అందుకే ప్రముఖులను పార్టీలో చేర్చుకుని ఈసారి ఎంతోకొంత ప్రభావం చూపాలనుకుంటోంది.


