భారతదేశంలో మరో రాష్ట్రంలో ఎబోలా వైరస్ సోకిందనే వార్త ఆందోళన రేపుతోంది. రాజస్థాన్‌లో ఎబోలా వైరస్ వ్యాధికి సంబంధించిన తొలి అనుమానిత కేసు నమోదైంది. ఉగాండా నుండి రాజస్థాన్‌లోని జైపూర్‌కు వచ్చిన పర్యాటకురాలికి ఈ వైరస్ లక్షణాలు కనిపించడంతో, వైద్యులు ఆమెను జైపూర్‌లోని RUHS ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో ఉంచారు.
శుక్రవారం ఉదయం ఎయిర్ అరేబియా విమానంలో షార్జా నుంచి జైపూర్‌కు వచ్చిన ఉగాండాకు చెందిన ఒక మహిళలో విమానాశ్రయంలో తనిఖీల సమయంలో సంబంధింత లక్షణాలు కనిపించాయి. వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు.
ఇదీ చదవండి: ప్రముఖ హాలీవుడ్ నటుడి దారుణ హత్య : ప్రియురాలి కొడుకు అరెస్ట్
ఆర్‌యూహెచ్ఎస్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ గుప్తా ప్రకారం, ఆ మహిళకు ఎబోలా వ్యాధి నిర్ధారణ కాలేదు. ఆమెలో వ్యాధిని పోలిన లక్షణాలు కనిపిస్తున్నప్పటికీ, ఖచ్చితమైన నిర్ధారణ చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ఆమెను అంటువ్యాధుల నియంత్రణ నిబంధనల ప్రకారం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. హైదరాబాద్‌లో కూడా అనుమానిత ఎబోలా వైరస్ కేసు నమోదైంది. సూడాన్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన విదేశీ ప్రయాణికుడికి థర్మల్ స్క్రీనింగ్ ద్వారా లక్షణాలు గుర్తించి, గాంధీ ఆసుపత్రికి తరలించారు
ఇదీ చదవండి: రూ. 549 కోట్ల బ్రిడ్జ్‌పై పగుళ్లు : వీడియో తీస్తోంటే.. ట్విస్ట్!


