శివాజీ సృష్టించిన చీర అంటూ అనసూయ కౌంటర్‌ | Actress Anasuya Again Comment On Shivaji | Sakshi
Sakshi News home page

శివాజీ సృష్టించిన చీర అంటూ అనసూయ కౌంటర్‌

Apr 11 2026 8:12 PM | Updated on Apr 11 2026 8:12 PM

Actress Anasuya Again Comment On Shivaji

యాంకర్‌, నటి అనసూయ మరోసారి నటుడు శివాజీపై కౌంటర్‌ వేసింది. కొద్దిరోజుల క్రితం మహిళల వస్త్రధారణ గురించి నటుడు శివాజీ చేసిన చెత్త వ్యాఖ్యలపై అనసూయ (Anasuya)ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే.. అయితే, తాజాగా   చీర కట్టుకుని తన కుటుంబంతో పాటుగా అనసూయ గుడికి వెళ్లింది. కొందరు నెటిజన్లు ఆ వీడియోను షేర్‌ చేస్తూ.. శివాజీ దెబ్బకు చీర కట్టుకుని తిరుగుతున్న అనసూయ అంటూ పోస్ట్‌ చేశారు. దీంతో ఆమె కూడా కౌంటర్‌ ఇచ్చింది.

నెటిజన్లు షేర్‌ చేసిన థంబ్‌నైల్‌ ఎలా ఉండాలో తనదైన స్టైల్లో అనసూయ ఒక సలహా కూడా ఇచ్చింది 'శివాజీ సృష్టించిన చీర ధరించి తిరుగుతున్న అనసూయ అంటూ థంబ్‌నైల్‌ పెడుతారనుకున్నాను. సరైన హెడ్‌లైన్‌ కూడా ఇదే కదా.. ఎందుకంటే మేము గతంలో ఎప్పుడు చీరలు కట్టుకోలేదు. ఏమైనా పోస్ట్‌ చేసేముందు చూసుకోవాలి కదా..' అంటూ కౌంటర్‌ ఇచ్చింది. వాస్తవంగా చాలా ఈవెంట్లలో అనసూయ చీరకట్టులోనే కనిపించిన సందర్భాలు ఉన్నాయి. గుడికి వెళ్తున్న సమయంలో దాదాపు చీరకట్టులోనే వెళ్తారనే విషయం తెలిసిందే. అనసూయ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఆమెకు మద్దతుగా షేర్‌ చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement