‘ఇరుముడి’ వేడుకలో బూతు పదాలు.. రవితేజపై నెటిజన్స్‌ ఫైర్‌! | Irumudi Pre Release Event: Netizens Fires On Ravi Teja, Ajay Ghosh | Sakshi
Sakshi News home page

ఇరుముడి వేడుకలో బూతు పదాలు.. రవితేజ, అజయ్ ఘోష్‌పై విమర్శలు

Aug 17 2026 3:51 PM | Updated on Aug 17 2026 5:03 PM

Irumudi Pre Release Event: Netizens Fires On Ravi Teja, Ajay Ghosh

ఈ మధ్య సినిమా ఈవెంట్స్‌లో నటీనటులు బూతు పదాలు మాట్లాడటం కామన్‌గా మారిపోయింది. స్టేజ్‌పై మాట్లాడుతున్నామనే విషయం మర్చిపోయి.. ఫ్లోలో నోటికి వచ్చిన మాటలు అనేస్తున్నారు. ఇటీవల సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ సైతం ఓ సినిమా వేడుకలో చేసిన పదప్రయోగం చర్చకు దారితీసింది. ఇప్పుడు తాజాగా స్టార్ హీరో రవితేజ, సీనియర్ నటుడు అజయ్ ఘోష్‌ కూడా సినిమా వేదికపై చేసిన కొన్ని పదప్రయోగాలు సోషల్ మీడియాలో విమర్శలకు కారణమవుతున్నాయి.

హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగిన ‘ఇరుముడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఇందుకు వేదికైంది. కార్యక్రమం మొత్తం సందడిగా సాగినప్పటికీ.. రవితేజ, అజయ్ ఘోష్ మాట్లాడిన సమయంలో వినిపించిన ఒకట్రెండు అసభ్య పదాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా అజయ్ ఘోష్ తన ప్రసంగంలో ఉపయోగించిన కొన్ని పదాలపై సోషల్ మీడియాలో నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రవితేజను పొగిడే క్రమంలో అనుకోకుండా బూతు పదాలను వాడేశాడు. 

(చదవండి: రవితేజకు 26 ఎకరాల తోట.. ఇప్పుడు వందల కోట్ల విలువ!)

మరో సందర్భంలో రవితేజ కూడా అభ్యంతరకరంగా భావించే ఓ పదాన్ని ఉపయోగించడంతో ఈ అంశంపై చర్చ మొదలైంది. వేదిక ముందు కూర్చొని ఉన్న రవితేజను ఈ సినిమాలో ఆయనకు కూతురిగా నటించిన నక్షత్ర కొన్ని ప్రశ్నలు అడిగింది. అందులో ఒకటి ‘నాకు నిక్ నేమ్ పెట్టమంటే ఏమని పెడతారు'.. అని  అడగగా  'ముదురు ము...'  అని రవితేజ అంటాడు. ఒక స్టార్‌ హీరో..చిన్న పిల్లను అలా అనడాన్ని నెటిజన్స్‌ తప్పుపడుతున్నారు. ప్రేమతో అన్నా సరే.. వేదికపై అలాంటి బూతు పదాన్ని వాడడం కరెక్ట్‌ కాదంటూ రవితేజను ట్రోల్‌ చేస్తున్నారు.

(చదవండి:‘మీకు బీఫ్‌ నచ్చిందా?’ హీరోయిన్‌కి షాకింగ్‌ ప్రశ్న.. రియాక్షన్‌ ఇదే!)

సాధారణ కమర్షియల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఇలాంటి పదాలు వినిపిస్తే.. వాటిని పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కానీ ‘ఇరుముడి’ సినిమా విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. అయ్యప్ప స్వామి భక్తులకు ‘ఇరుముడి’ అనే పదానికి ఎంతో పవిత్రమైన అర్థం ఉంది. అంతేకాదు.. ఈ సినిమాలో రవితేజ అయ్యప్ప స్వామి మాలలో కనిపిస్తున్నారు. భక్తి, ఆధ్యాత్మిక నేపథ్యంతో తెరకెక్కుతున్న సినిమా ప్రమోషన్ కార్యక్రమంలోనే బూతు పదాలు వినిపించడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement