విషాదం.. 36 ఏళ్ల నటి అనుమానాస్పద మృతి! | Hollywood Actress Hayden Panettiere Pasess Away | Sakshi
Sakshi News home page

విషాదం.. 36 ఏళ్ల వయసులో హీరోయిన్‌ అనుమానాస్పద మృతి!

Aug 17 2026 3:36 PM | Updated on Aug 17 2026 3:51 PM

Hollywood Actress Hayden Panettiere Pasess Away

హాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటి, గాయని హేడెన్ పానెటెర్‌ 36 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆమె మృతిని కుటుంబ సభ్యులు ధ్రువీకరించినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. అయితే ఆమె మరణానికి గల కారణాన్ని అధికారులు ఇప్పటివరకు వెల్లడించలేదు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

హేడెన్ పానెటెర్‌( Hayden Panettiere) మరణవార్త  హాలీవుడ్ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె తండ్రి స్కిప్ పానెటెర్‌ కుటుంబం తరఫున సంతాప ప్రకటన విడుదల చేశారు. హేడెన్ తమ కుటుంబానికి, ఆమెను అభిమానించే కోట్లాది మందికి ఎంతో ప్రేమను, ఆనందాన్ని అందించిన వ్యక్తి అని పేర్కొంటూ, ఈ విషాద సమయంలో తమ కుటుంబ గోప్యతను గౌరవించాలని కోరారు.


హేడెన్‌ పానెటెర్‌ బాలనటిగా తన కెరీర్‌ను ప్రారంభించారు. చిన్నతనంలోనే టెలివిజన్‌ సిరీస్‌లు, సినిమాల్లో కనిపించిన ఆమెకు యానిమేషన్‌ చిత్రం 'ఎ బగ్స్ లైఫ్' (A Bug’s Life)లో ‘డాట్‌’ పాత్రకు వాయిస్‌ అందించడం ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత రిమెంబర్‌ ది టైటాన్స్‌ (Remember the Titans), డైనోసర్‌(Dinosaur), ‘స్క్రీమ్ 4’ లాంటి పలు హాలీవుడ్‌ చిత్రాల్లో నటించింది.

2006లో వచ్చిన టెలివిజన్‌ సిరీస్‌ హీరోస్‌(Heroes) హేడెన్‌ కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ఇందులో క్లైర్‌ బెన్నెట్‌ పాత్రలో ఆమె నటనకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. ఈ సిరీస్‌తో ఆమెకు భారీగా అభిమానులు ఏర్పడ్డారు.

ఆ తర్వాత నాష్‌విల్లె(Nashville) సిరీస్‌లో జూలియట్‌ బార్న్స్‌గా ఆమె మరో కీలక పాత్ర పోషించారు. నటనతో పాటు పాటలు పాడుతూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ పాత్రకు ఆమె రెండు గోల్డెన్‌ గ్లోబ్‌ నామినేషన్లు అందుకున్నారు. ఈ ఏడాది జనవరిలో విడుదలైన సైకలాజికల్‌ థ్రిల్లర్‌ స్లీప్‌వాకర్ (Sleepwalker)లో సారా పాంగ్‌బోర్న్‌గా ఆమె కనిపించారు. ఇదే ఆమె చివరి చిత్రం. ‘దిస్ ఈజ్ మీ: ఎ రెకనింగ్’ పేరుతో రాసిన ఆమె ఆత్మకథ ఈ ఏడాదిలోనే విడుదల చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement