హీరోయిన్‌కు బ్యాడ్ టైమ్.. సినిమా కష్టాలు.. వ్యాపారంలోనూ నష్టాలు! | Bad times for film Actress Difficulties for the film and Losses in business | Sakshi
Sakshi News home page

హీరోయిన్‌కు బ్యాడ్ టైమ్.. సినిమా కష్టాలు.. వ్యాపారంలోనూ నష్టాలు!

Aug 16 2026 11:17 PM | Updated on Aug 16 2026 11:17 PM

Bad times for film Actress Difficulties for the film and Losses in business

కెరీర్ ఊపులో ఉన్నప్పుడే కొంతమంది హీరోయిన్లు తెలివిగా వ్యవహరిస్తుంటారు. సినిమాల పైనే ఆధారపడకుండా ప్లాన్-బితో వారికి తెలిసిన వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. అలానే ఓ ప్రముఖ హీరోయిన్ కూడా వ్యాపార రంగంలోకి అడుగు పెట్టింది. ఎప్పటికైనా సినిమా అవకాశాలు తగ్గుతాయని ముందే ఊహించిన ఈ హీరోయిన్.. కెరీర్ ఊపందుకున్నప్పుడే వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. అప్పట్లో వరుసపెట్టి సినిమాలు చేసిన ఈ హీరోయిన్ తనకు సినిమాల ద్వారా వచ్చిన డబ్బును పలు వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టింది. ప్రస్తుతం సౌత్‌లో ఆమెకు పెద్దగా అవకాశాలు లేవు కానీ.. గతంలో సంపాదించిన మొత్తంతో ఇప్పటికీ చాలా ప్రశాంతంగానే ఉందట.

అయితే తాజాగా ఆమె పెట్టిన పెట్టుబడుల్లో కొన్ని ఇబ్బందుల్లో పడినట్లు సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అమెరికా వాణిజ్య విధానాలు, దేశీయ మార్కెట్‌లో జరుగుతున్న మార్పులు వంటి కారణాలతో కొన్ని వ్యాపారాలు నష్టాలను ఎదుర్కొంటున్నాయట. అయితే తనకు బాగా తెలిసిన జిమ్ బిజినెస్ మాత్రం ఆమెకు బాగా కలిసి వచ్చిందని సమాచారం. 

కానీ ఇతరుల సలహాలతో పెట్టుబడి పెట్టిన కొన్ని వ్యాపారాలు మాత్రం ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదట. వాటి నుంచి బయటపడలేక, కొనసాగించలేక ఆమె సతమతమవుతున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో తన పెట్టుబడులను రక్షించుకోవడానికి ఇండస్ట్రీలో తనకు సన్నిహితంగా ఉండే వారితో ఆమె ఇప్పటికే చర్చలు జరిపినట్లు సమాచారం. నష్టాల నుంచి ఎలా బయటపడాలి అనే అంశంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement