చిరంజీవితో సినిమా.. నేను ఇంకాస్త ఎదగాలి | Director Venky Atluri Reacts Chiranjeevi Movie | Sakshi
Sakshi News home page

Chiranjeevi: చిరుతో థ్రిల్లర్ మూవీ.. హిట్ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Aug 16 2026 7:27 PM | Updated on Aug 16 2026 7:27 PM

Director Venky Atluri Reacts Chiranjeevi Movie

తెలుగులో ఒకప్పటి దర్శకులైనా ఇప్పటి జనరేషన్ డైరెక్టర్స్ అయినా మెగాస్టార్ చిరంజీవితో ఒక్క మూవీ అయినా చేయాలని ఆశపడుతుంటారు. సర్, లక్కీ భాస్కర్, విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రాలతో వరస హిట్స్ అందుకున్న వెంకీ అట్లూరి కూడా ఇప్పుడు చిరుతో సినిమా చేయాలనుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

(ఇదీ చదవండి: సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా రివ్యూ)

'చిరంజీవితో ఒక సినిమా అనుకున్నాం. కానీ ఇప్పుడే చేయాలనుకోవట్లేదు. మరీ ముఖ్యంగా నేను అనుకున్న సబ్జెక్టుని, చిరంజీవి లాంటి స్టార్‌ని హ్యాండిల్ చేయాలంటే, నేను ఇంకాస్త ఎదగాలి అనుకుంటున్నాను. చిరంజీవి లాంటి స్టార్ హీరో చేసినప్పుడు అన్నీ సరిగ్గా చూసుకోవాలి. ఓ థ్రిల్లర్ సబ్జెక్ట్ అనుకుంటున్నాను' అని వెంకీ అట్లూరి చెప్పుకొచ్చాడు.

వెంకీ అట్లూరి గురించి చెప్పుకోవాలంటే హీరోగా టాలీవుడ్‌లో కెరీర్ ప్రారంభించాడు. రెండు చేసేసరికి సీన్ అర్థమై దర్శకుడిగా మారిపోయాడు. వరుణ్ తేజ్ హీరోగా 'తొలిప్రేమ' తీసి డైరెక్టర్‌గా తొలి సక్సెస్ అందుకున్నాడు. కానీ తర్వాత చేసిన రంగ్ దే, మిస్టర్ మజ్ను ఫెయిలయ్యాయి. దీంతో రూట్ మార్చిన వెంకీ.. ధనుష్‌తో 'సర్', దుల్కర్ సల్మాన్‌తో 'లక్కీ భాస్కర్' లాంటి వైవిధ్యమైన చిత్రాలు చేశాడు. తాజాగా సూర్యతో 'విశ్వనాథ్ అండ్ సన్స్' చేసి అద్భుతమైన హిట్ కొట్టాడు. మరి ఇలాంటి దర్శకుడు చిరంజీవితో థ్రిల్లర్ అంటే ఆసక్తికరంగా అనిపిస్తోంది.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ ప్రైజ్‌మనీ రూ.35 లక్షలు.. కానీ నన్ను మోసం చేశారు!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement