బండ్ల గణేశ్ కూతురి పెళ్లి.. టాలీవుడ్ సినీతారల సందడి | Tollywood Celebrities At Producer Bandla Ganesh Daughter Janani Marriage, Watch Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Bandla Ganesh: బండ్ల గణేశ్ కూతురి పెళ్లి.. టాలీవుడ్ సినీతారల సందడి

Aug 16 2026 12:29 PM | Updated on Aug 16 2026 2:02 PM

Tollywood stars at Producer Bandla Ganesh Daughter Janani Marriage

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన కూతురు జనని వివాహం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో టాలీవుడ్ సినీతారలు పెద్దఎత్తున సందడి చేశారు. ఈ పెళ్లి ఫంక్షన్‌లో హీరోలు వెంకటేశ్, నాగార్జున, చిరంజీవి, డైరెక్టర్స్ అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను, హాస్యనటులు బ్రహ్మనందం, సునీల్ హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

ఈ పెళ్లి వేడుకలో మెగాస్టార్ సతీసమేతంగా పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సినీ, రాజకీయ ప్రముఖులు పెళ్లి వేడుకలో పాల్గొని నూతన జంటను ఆశీస్సులు అందించారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement