నా అంత్యక్రియలు నా కొడుకుతోనే జరిపించండి | married woman incident in karnataka | Sakshi
Sakshi News home page

నా అంత్యక్రియలు నా కొడుకుతోనే జరిపించండి

Aug 16 2026 9:31 AM | Updated on Aug 16 2026 9:31 AM

married woman incident in karnataka

కర్ణాటక: భారీగా కట్న కానుకలు ఇచ్చి వివాహం జరిపించినా భర్త, అత్తమామల ధనదాహం తీరలేదు. వారి వేధింపులను తట్టుకోలేక వివాహిత ఉరివేసుకొని అత్మహత్య చేసుకొన్న సంఘటన చింతామణి పట్టణంలోని సొణ్ణశెట్టిహశ్లి బడావణెలో శనివారం జరిగింది. వివరాలు.. మృతురాలు మమతశ్రీ (26). పట్టణంలోని గణేష్‌నగరకి చెందిన శ్రీనివాసరెడ్డి కూతురు మమతశ్రీని ఐదేళ్ల కిందట తాలూకాలోని భక్తరహళ్లికి చెందిన మోహన్‌రెడ్డికి ఇచ్చి ఘనంగా పెళ్లి చేశారు.

 వీరికి 4 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. భర్తకు చేళూరు రోడ్డులో బైకు షోరూం ఉంది. మధ్యాహ్నం భోజనానికి రాగా ఇంటి తాళాలు వేసి ఉన్నాయి, కిటికీలో నుంచి చూడగా మమత ఫ్యాన్‌కు ఉరివేసుకుని శవమైంది. దీంతో భర్త పోలీసులు సమాచారమిచ్చాడు. పోలీసులు తనిఖీలు చేయగా డెత్‌నోట్‌ లభించింది. తన అంత్యక్రియలను భర్త కాకుండా కొడుకుతో నిర్వర్తించాలని రాసి ఉంది. భర్త ఎంతగా సతాయించాడో దీనిని బట్టి అర్థమవుతుంది. ఎస్పీ జగన్నాథ్‌రై, తహశీల్దార్‌ సుదర్శన్‌ యాదవ్, సీఐ విజికుమార పరిశీలించి కేసు నమోదు చేశారు.     

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement