బెంగళూరు: నేను ఎక్కడ సైలెంట్‌గా ఉన్నాను? నేను సీఎంని కాదు, కాబట్టి బాధ్యత లేదు అని మాజీ సీఎం సిద్దరామయ్య అన్నారు. పంద్రాగస్టు సందర్భంగా నగరంలో మెజెస్టిక్ వద్ద గల సంగోళి రాయణ్ణ విగ్రహానికి పూలదండ వేసి నివాళులు అర్పించారు. సిద్దరామయ్య సైలెంట్ అయ్యారు అని విలేకరులు ప్రస్తావించగా, నేను ఎక్కడ మౌనంగా ఉన్నాను? అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యా, పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నా, ఎక్కువగా మాట్లాడటం లేదు, నేను సీఎం కాదు కదా? అని అన్నారు. త్వరలో ఓబీసీలతో అహింద చళవళి కార్యక్రమం జరుగుతుందని, తాను పాల్గొంటానని చెప్పారు.


