పూణేకు చెందిన డింక్ కపుల్ (DINKడబుల్ ఇన్‌కమ్, నో కిడ్స్) 38 ఏళ్లకే రిటైర్ మెంట్ ప్రకటించారు. రూ. 11.5 కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ, వచ్చే మూడేళ్లలో రిటైర్ కావాలని నిర్ణయించుకోవడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. అధిక పని ఒత్తిడి, ఆరోగ్య సమస్యల కారణంగా కెరీర్ కంటే వ్యక్తిగత స్వేచ్ఛకే ప్రాధాన్యతనిస్తూ వారు ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ దంపతులు.
ఒత్తిడికి దూరంగా వ్యక్తిగత జీవితాలపై దృష్టి పెట్టాలని కోరుకుంటున్నట్లు సమాచారం. వీరి కథను ఒక బంధువు ఎక్స్‌లో షేర్ చేశారు. ఈ సందర్భంగా వీరి ఆస్థులు, జీవనశైలిపై నెట్టింట ఆసక్తి నెలకొంది. ఈ జంట సంవత్సరాల తరబడి సంపదను కూడ గట్టుకున్నారని, కానీ ఇప్పుడు నిజంగా ఎంత డబ్బు సరిపోతుందని ప్రశ్నించుకుంటున్నారని ఆ బంధువు పేర్కొన్నారు.
ఆ పోస్ట్ ప్రకారం, ఈ జంట మొత్తం ఆస్తి రూ.11. 5 కోట్లు. ఈ ఆస్తులలో రియల్ ఎస్టేట్‌లో సుమారు రూ. 3.2 కోట్లు, ఇండియన్ స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్‌లో రూ. 1.8 కోట్లు, యూఎస్ ఈక్విటీలలో రూ. 5 కోట్లు, నగదు, పదవీ విరమణ పొదుపుల రూపంలో దాదాపు రూ. 1.5 కోట్లు ఉన్నాయి. వారి వార్షిక గృహ ఖర్చులు సుమారు రూ. 22 లక్షలుగా అంచనా. అయితే పదవీ విరమణ చేసిన తమ తల్లిదండ్రులకు అండగా ఉండటం కోసం, ఈ జంట మొదట్లో తమ సంపదను పెంచుకుంటూనే ఉండాలని ప్రణాళిక వేసుకున్నారని ఆ పోస్ట్ పేర్కొంది. అయితే, ఎక్కువ పని గంటలు, నిరంతర ఒత్తిడి,పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు వారి ప్రాధాన్యతలను పునరాలోచించుకునేలా చేశాయట. అందుకే తాము రిటైర్ అయ్యే ముందు మరో రెండు, మూడేళ్లు పనిచేసి మరికొంత సొమ్మును దాచుకోవాలని భావిస్తున్నారు.
ఇదీ చదవండి: 12 సీట్లతో మొదలై రెండేళ్లలోనే రూ. 350 కోట్ల బిజినెస్
నెటిజన్ల రియాక్షన్స్
ఈ నిర్ణయం ఆన్‌లైన్‌లో మిశ్రమ స్పందనలను రేకెత్తించింది. కొందరు నెటిజన్లు రూ. 11.5 కోట్ల నెట్‌వర్త్ , పిల్లలు లేని కుటుంబానికి రూ. 22 లక్షల వార్షిక ఖర్చుల దృష్ట్యా ఈ రిటైర్మెంట్ ప్లాన్ సరైనదేనని సమర్థించారు. మరికొందరు ముందస్తు రిటైర్మెంట్ (Early Retirement)కు సుదీర్ఘమైన ఆర్థిక ప్రణాళిక, నిరంతర క్యాష్ ఫ్లో అవసరమని హెచ్చరించారు. కెరీర్ పురోగతి కంటే ఆర్థిక స్వేచ్ఛ, ఆరోగ్యం , సమయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే నేటి యువత ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తోందని చాలామంది అభిప్రాయపడటం విశేషం.
ఇదీ చదవండి: 33 ఏళ్ల సుదీర్ఘ సేవలు : ప్రొఫెసర్‌కు సర్‌ప్రైజ్ ఎమోషనల్ వీడియో
ఇదీ చదవండి: బ్లింకిట్, జెప్టో, ఇన్‌స్టామార్ట్ కాదు : బొద్దింకలు, ఎలుకలు, బల్లుల కేంద్రాలు


