బ్లింకిట్‌, జెప్టో, ఇన్‌స్టామార్ట్‌ కాదు : బొద్దింకలు, ఎలుకలు, బల్లుల కేంద్రాలు | Cockroaches Lizards Licences Of Blinkit Instamart And Zepto Facilities Suspended | Sakshi
Sakshi News home page

బ్లింకిట్‌, జెప్టో, ఇన్‌స్టామార్ట్‌ కాదు : బొద్దింకలు, ఎలుకలు, బల్లుల కేంద్రాలు

Aug 15 2026 10:37 AM | Updated on Aug 15 2026 10:47 AM

Cockroaches Lizards Licences Of Blinkit Instamart And Zepto Facilities Suspended

సాక్షి, ముంబై: మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) క్విక్-కామర్స్ ప్లాట్‌ఫారమ్స్‌కు భారీ షాకిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన తనిఖీ డ్రైవ్‌లో బొద్దింకలు,  గడువు ముగిసిన ఆహారం వంటి పలు ఆహార భద్రత, పరిశుభ్రత ఉల్లంఘనలు బయటపడటంతో, బ్లింకిట్ (Blinkit), జెప్టో (Zepto), ఇన్‌స్టామార్ట్ (Instamart) సంస్థలకు చెందిన 14కేంద్రాల (Dark Stores/Warehouses) లైసెన్స్‌లను  ఎఫ్‌డీఏ నిలిపి వేసింది.

రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘన, నిల్వ ఉంచిన ఆహార పదార్థాల గడువు తీరిపోవడం, బొద్దింకలు, ఎలుకలు, బల్లులు ఉండటం వంటి తీవ్రమైన లోపాలను అధికారులు గుర్తించారు. ముంబైలోని మలాడ్ వెస్ట్ ప్రాంతంలో, మాల్వానీలోని మార్వే రోడ్డులో ఉన్న బే వ్యూ బిల్డింగ్‌లోని ఒక బ్లింకిట్ కేంద్రం యొక్క ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సును ఎఫ్‌డీఏ నిలిపివేసింది.గడువు ముగిసిన ఆహారం కారణంగా జెప్టో కేంద్రంపై సస్పెన్షన్ వేటు వేసింది.  <

 మొత్తం 86 కేంద్రాలు తనిఖలు చేయగా  కోల్డ్ స్టోరేజ్ ఉష్ణోగ్రతలలో తీవ్ర లోపాలు , 40 మంది సిబ్బందికి వైద్య పరీక్షల రికార్డులులేకపోవడం వర్కర్లు హెడ్‌గేర్, ఆప్రాన్, గ్లౌజులు ధరించకపోవడంలాంటి కనీస నిబంధనల ఉల్లంఘనలను గమనించారు. ఆహార ప్యాకెట్ల పక్కనే ఎలుకల పిండెల (Rodent droppings) కుప్పలు, బల్లుల సంచారం , తుప్పు పట్టిన ర్యాక్‌లను అధికారులు కనుగొన్నారు. ఇంకా కుప్పలుగా గడువు తీరిన  చికెన్‌తోపాటు, డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదు, తీవ్రమైన బొద్దింకల బెడద, లోపభూయిష్టమైన సీలింగ్ , ఫ్లోరింగ్‌లను గుర్తించారు. ఈ కేంద్రానికి 74 మార్కులకు గాను కేవలం 34 (46%) మార్కులు మాత్రమే లభించాయి. 60 కేంద్రాలకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు జారీ చేశారు. దాదాపు 14 కేంద్రాల  లైసెన్సులను నిలినివేసింది. బ్లింకిట్‌,జెప్టోకి చెందిన  చెరో 5 కేంద్రాలు ఉండగా, ఇన్‌స్టామార్ట్  కేంద్రాలు రెండు,ఇతరాలు రెండు  ఉన్నాయి.

గోరేగావ్ ఈస్ట్‌లోని దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ సిటీలో ఉన్న 'బాలీవుడ్ కేఫ్' పై కూడా FDA దాడులు నిర్వహించింది. అత్యంత పరిశుభ్రత లేని వాతావరణంలో ఈగలు, మురికి డ్రెయిన్లు, తుప్పు పట్టిన పరికరాల మధ్య ఆహారాన్ని తయారు చేస్తున్నట్లు కనుగొని, ఆహార భద్రతా చట్టం (Section 69) కింద చర్యలు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement