breaking news
Instamart
-
ఇన్‌స్టామార్ట్.. ప్రతి 10 ఆర్డర్లలో 7 పెరుగు కోసమే..!
సాక్షి, విశాఖపట్నం: టీ పెట్టాలి.. పాలు లేవా? అయితే ఆర్డర్ పెట్టేద్దాం. ఐస్‌క్రీమ్ తినాలనిపిస్తోందా? ఆర్డర్ చేసేద్దాం. వర్షం పడుతోంది.. వేడివేడి స్నాక్స్ కావాలి? ఆర్డర్.! ఎక్కడ చూసినా ఇప్పుడు ‘క్లిక్.. ఆర్డర్’ ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు చిన్న షాంపూ కావాలన్నా వీధి చివర దుకాణానికి వెళ్లేవాళ్లం. పెరుగు కోసం డెయిరీకి, స్వీట్స్ కోసం మిఠాయి షాపుకి.. ఇలా ఏం కావాలంటే అక్కడికి వెళ్లి తెచ్చుకునేవాళ్లం. కానీ.. ఇప్పుడు ఫాస్ట్ డెలివరీ యాప్స్ వచ్చాక.. మనకు కావాల్సిన వస్తువు పది నిమిషాల్లోనే మన ఇంటికి వచ్చేస్తోంది. అందుకే ఆన్లైన్ ఆర్డర్లకు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోంది. వైజాగ్‌లో కూడా క్విక్ డెలివరీ యాప్స్‌కు ఆదరణ బాగా పెరిగిందని ‘ఇన్‌స్టామార్ట్’ సంస్థ చేసిన సర్వేలో వెల్లడైంది. ఇంతకీ వైజాగ్ వాసులు ఫాస్టెస్ట్ డెలివరీ యాప్స్‌లో ఎక్కువగా ఏం ఆర్డర్ చేస్తున్నారో తెలుసా? అదేనండి.. పెరుగు. ఇంకా ఏయే విషయాల్లో వైజాగ్ వాసులు ‘ఫాస్ట్’గా ఉన్నారో తెలుసుకుందామా? ఉరుకుల పరుగుల జీవనంలో ఇప్పుడు అంతా అరచేతిలోనే జరిగిపోతోంది. నచ్చింది తినాలన్నా, కొనాలన్నా ఒక్క క్లిక్‌తో ఇంటికే తెప్పించుకుంటున్నారు. ఆర్డర్ పెట్టి 10 నుంచి 15 రోజులు వేచి చూసే రోజులు పోయాయి. ఆర్డర్ పెట్టిన 15 నిమిషాల్లో డెలివరీ చేస్తాం అని ఒకరంటే, లేదు లేదు.. 10 నిమిషాల్లోనే మీ ఇంటికి తెస్తాం అని మరొకరు పోటీపడి మరీ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. పైగా, షాప్‌లలో కూడా లభించని ఆఫర్లతో నిమిషాల్లోనే వస్తువులు ఇంటికి వస్తుండటంతో.. శ్రమ తప్పుతోందని భావించి అంతా ‘క్విక్ కామర్స్’పైనే ఆధారపడుతున్నారు. మధ్యాహ్నం, రాత్రి వేళల్లోనే అధికం ఉదయం పూటతో పోలిస్తే, మధ్యాహ్నం భోజన సమయంలో, అలాగే అర్ధరాత్రి వేళల్లో నగరంలో క్విక్ ఆర్డర్లు అత్యధికంగా ఉంటున్నాయి. హైపర్–ఎఫెక్టివ్ డెలివరీ నెట్వర్క్ మద్దతుతో ఆన్లైన్ గ్రోసరీ డెలివరీ సంస్థల మధ్య పోటీ తీవ్రమవుతోంది. వీలైనంత త్వరగా వినియోగదారుడికి చేరుకోవాలనే పోటీతో, తక్కువ సమయంలో అందించేందుకు ప్రయత్నింస్తున్నాయి. ఈ ప్లాట్‌ఫాంలో సగటున 10.4 నిమిషాల్లోనే ఆర్డర్లు డెలివరీ అవుతున్నాయి. ఈ జూన్‌లో ఇన్‌స్టామార్ట్ ఒక ఆర్డర్‌ను కేవలం 2.18 నిమిషాల్లో అందజేసి రికార్డు సృష్టించింది. 2024 జూన్ నుంచి 2025 జూన్ మధ్య నగరానికి చెందిన ఒక వినియోగదారుడు ఏకంగా 337 ఆర్డర్లు చేశాడంటే.. ఈ యాప్స్ మనల్ని ఎంతలా ప్రభావితం చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. స్థానిక ఉత్పత్తుల నుంచి ప్రీమియం వస్తువుల వరకు విస్తృత శ్రేణిలో అందించేందుకు ఈ–కామర్స్ ప్లాట్‌ఫాంలు పోటీపడుతున్నాయి. అందుకే విశాఖ వాసి ఇల్లు కదలకుండా, తనకు నచ్చిన వస్తువును కొనుగోలు చేస్తూ ‘స్మార్ట్’గా మార్ట్‌ను ఇంటికి తెప్పించుకుంటున్నాడు. వినియోగదారుడి ఆసక్తికి అనుగుణంగా ఆఫర్లతో ఆకట్టుకుంటూ, ఆన్లైన్ గ్రోసరీ డెలివరీ యాప్స్ తమ ఆర్డర్లను గణనీయంగా పెంచుకుంటున్నాయి.ఏమేం ఆర్డర్ చేస్తున్నారంటే... ఇన్‌స్టామార్ట్ క్విక్ కామర్స్ యాప్.. ఏడాది పాటు విశాఖ నగరంలో చేసిన సర్వేలో పలు ఆసక్తికరమైన అంశాలువెల్లడయ్యాయి. వైజాగ్ ప్రజలు చేసే ప్రతి 10 ఆర్డర్లలో 7 పెరుగు కోసమే ఉంటున్నాయి. ఫుల్ క్రీమ్, టోన్డ్ మిల్‌్క, పన్నీర్ కూడా బాగా కొనుగోలు చేస్తున్నారు. తర్వాతి స్థానంలో ఐస్‌క్రీమ్‌లు, స్వీట్స్ ఉన్నాయి. వీటి ఆర్డర్లలో ఏడాది కాలంలో 112 శాతం వృద్ధి కనిపించింది. టమాటాలు, రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్, ఉల్లిపాయలు, గుడ్లు, బంగాళాదుంపలు వంటి కూరగాయలనూ ఆన్లైన్లోనే కొంటున్నారు.ఉదయం లంచ్ బాక్స్ కోసం ఏ కూర వండాలో నిర్ణయించుకుని ఆన్లైన్లో తాజా కూరగాయలకు ఆర్డర్ పెడుతున్నారు. తాలింపు సిద్ధం చేసుకునేలోపే.. కూరగాయలు ఇంటికి చేరుతున్నాయి. వీటితో పాటు వేరుశనగ, కొబ్బరి, లేత కొబ్బరి, ఇడ్లీ రవ్వ వంటి ఉత్పత్తులకు కూడా అధిక డిమాండ్ ఉంది. వివాహ సీజన్లో సౌందర్య, వస్త్రధారణ ఉత్పత్తుల ఆర్డర్లు పెరుగుతున్నాయి. వర్షాకాలంలో సాయంత్రం వేళల్లో బంగాళాదుంప చిప్స్, ఆలూ భుజియా, పాప్‌కార్న్ వంటి స్నాక్స్ ఎక్కువగా కొంటున్నారు. పండగల సమయంలో పండ్లు, కూరగాయలు, పూజా నిత్యావసరాలను ఆర్డర్ చేస్తున్నారు. -
బంగారం డోర్ డెలివరీ.. సెక్యూరిటీ చూశారా?
కాదేదీ డోర్ డెలివరీకి అనర్హం అన్నట్లు ఆర్డర్ ఇస్తే చాలు ఇప్పుడు ప్రతీదీ ఇంటి ముంగిటకే వచ్చేస్తోంది. ఈ ఏడాది అక్షయ తృతీయను పురస్కరించుకుని ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్ నిత్యావసర సరుకుల మాదిరిగానే బంగారాన్నీ డెలివరీ చేస్తామంటూ ముందుకు వచ్చింది. అయితే డోర్ స్టెప్ గోల్డ్ డెలివరీ కోసం ఆ కంపెనీ చేసిన హై సెక్యూరిటీ ఏర్పాట్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతున్న వరుస వైరల్ వీడియోలు నెటిజనుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా విస్తృతంగా షేర్ అవుతున్న ఒక వీడియో క్లిప్‌లో స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్.. సెక్యూరిటీ గార్డుతో కలిసి ట్రాఫిక్‌లో బైక్‌పై వెళ్తూ కనిపించారు. అందులో సెక్యూరిటీ గార్డు ఒక చేతిలో లాఠీ, మరో చేతిలో హై సెక్యూరిటీ లాకర్ పట్టుకొని కనిపించాడు. ఈ వీడియో వీక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది."ఏమి జరుగుతోంది?" అంటూ ఒక ఇన్స్టాగ్రామ్ యూజర్ ప్రశ్నించగా "రియల్ గోల్డ్ డెలివరీ కర్నే కే లియే రియల్ సెక్యూరిటీ చాహియే బ్రో (రియల్ గోల్డ్ కోసం రియల్ సెక్యూరిటీ కావాలిగా) అని స్విగ్గీ చమత్కారంగా బదులిచ్చింది. ఆన్ లైన్ లో ప్రచారం ఊపందుకోవడంతో స్విగ్గీ ఇన్ స్టామార్ట్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో వైరల్ వీడియోలను రీపోస్ట్ చేసింది. దీనికి బంగారమా? నిజంగానా?' అంటూ మరో యూజర్ ఆశ్చర్యం వ్యక్తం చేయగా దీనికి కూడా ‘డెలివరింగ్ సోనా ఇన్ ఎవరీ కోనా కోనా’(ప్రతి మూలకూ బంగారం డెలివరీ) అంటూ స్విగ్గీ రిప్లయి ఇచ్చింది.కాగా కల్యాణ్ జ్యువెల్లర్స్ నుంచి వివిధ బరువుల బంగారు, వెండి నాణేలను నిమిషాల్లో కస్టమర్లకు డెలివరీ చేయనున్నట్లు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. క్విక్ కామర్స్ సర్వీస్ ద్వారా లభించే నాణేలలో 0.5 గ్రాములు, 1 గ్రాము బంగారు నాణేలు, అలాగే 5 గ్రాములు, 10 గ్రాములు, 20 గ్రాముల వెండి నాణేలు ఉన్నాయి. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
స్విగ్గీ ‘స్కూట్సీ’లో రూ.1,000 కోట్ల పెట్టుబడి
ప్రముఖ ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ దిగ్గజం స్విగ్గీ(Swiggy) తన లాజిస్టిక్స్ సామర్థ్యాలను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ వ్యూహాత్మక చర్యలో భాగంగా కంపెనీ ఆధ్వర్యంలోని అనుబంధ సంస్థ ‘స్కూట్సీ(Scootsy)’లో రూ.1,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఈ సంస్థలో డిసెంబర్లో రూ.1,600 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. ఒక్కో స్కూట్సీ షేరు విలువ రూ.7,640గా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విడతల్లో రైట్స్ ఇష్యూ ద్వారా ఈ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టనున్నారు.స్విగ్గీ క్విక్ కామర్స్ వ్యాపారం ఇన్‌స్టామార్ట్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సంస్థ కార్యకలాపాలకోసం, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, ఇతర మూలధన వ్యయాలకు ఈ పెట్టుబడిని ఉపయోగించనున్నట్లు కంపెనీ తెలిపింది. 2018లో స్విగ్గీ కొనుగోలు చేసిన స్కూట్సీ.. రెస్టారెంట్, రుచికరమైన ఆహారం, టాయ్స్, బ్యూటీ, ఎలక్ట్రానిక్స్ సహా మరెన్నో కేటగిరీల్లో ఇంట్రాసిటీ ఆన్లైన్ డెలివరీ అందించే ప్లాట్‌ఫామ్. ఇది హోల్‌సేల్ వ్యాపారులు, రిటైలర్లకు గోదాము నిర్వహణ, వేర్ హౌస్ ప్రాసెసింగ్, ఆర్డర్ ఫుల్ ఫిల్మెంట్, ప్యాకింగ్, షిప్పింగ్ సేవలను కూడా అందిస్తుంది.పెరుగుతున్న టర్నోవర్2024 ఆర్థిక సంవత్సరంలో స్కూట్సీ రూ.5,796 కోట్ల టర్నోవర్‌ను నివేదించింది. ఇది 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.3,686 కోట్లుగా, 2022 ఆర్థిక సంవత్సరంలో రూ.1,580 కోట్లుగా ఉంది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో సప్లై చెయిన్ సేవల నుంచి స్విగ్గీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 23 శాతం పెరిగి రూ.1,693 కోట్లకు చేరింది.ఇదీ చదవండి: వచ్చేవారం యూఎస్ రక్షణశాఖలో 5,400 మందికి లేఆఫ్స్క్విక్ కామర్స్‌లో భారీగా పెట్టుబడులువేగంగా అభివృద్ధి చెందుతున్న రంగంలో ఆధిపత్య మార్కెట్ వాటాను పొందడానికి స్విగ్గీ, దాని ప్రత్యర్థి జొమాటో రెండూ తమ క్విక్ కామర్స్ వ్యాపారాల్లో పెట్టుబడులను పెంచుతున్నాయి. స్కూట్సీలో తాజా పెట్టుబడి దాని లాజిస్టిక్స్ మౌలికసదుపాయాలను మెరుగుపరచడానికి, కస్టమర్లకు సమర్థవంతమైన, సకాలంలో డెలివరీలను అందించేందుకు తోడ్పడుతుందని స్విగ్గీ తెలిపింది. -
క్విక్ కామర్స్‌పై విమర్శలు ఎందుకు..
కిరాణా సరుకులు, నిత్యావసర వస్తువులను నిమిషాల్లో డెలివరీ చేస్తామని హామీ ఇస్తున్న క్విక్ కామర్స్ బిజినెస్ పట్టణ ప్రాంతాల్లో వేగంగా ప్రజాదరణ పొందుతోంది. ఇప్పటికే బ్లింకిట్, ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్, జెప్టో.. వంటి సంస్థలు ఈ సర్వీసులు అందిస్తున్నాయి. అయితే ఈ బిజినెస్‌పై ప్రజాదరణతోపాటు విమర్శలు సైతం పెరుగుతున్నాయి. ఇందుకు కొన్ని కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.వ్యతిరేక పోటీ విధానాలుక్విక్ కామర్స్ సంస్థలు వ్యతిరేక పోటీ విధానాలను అనుసరిస్తున్నాయనే వాదనలున్నాయి. సాంప్రదాయ రిటైలర్లు, ముఖ్యంగా కిరాణా దుకాణాదారులపై క్విక్ కామర్స్ ప్రభావం భారీగా ఉంది. ఈ సంస్థలు అందించే డిస్కౌంట్లు, నేరుగా ఇంటికే డెలివరీ చేసే సేవలతో కిరాణాదారుల వ్యాపారం తీవ్రంగా దెబ్బతింది. వినియోగదారులకు వేగంగా సర్వీసులు అందించేందుకు స్థానికంగా డార్క్ స్టోర్లను, చిన్న, ఆటోమేటెడ్ గోదాములను ఉపయోగిస్తున్నాయి.ఆకర్షణీయ ధరలుసాంప్రదాయ రిటైల్ విధానంలో వివిధ దశల్లో ఉండే మధ్యవర్తుల కమీషన్ల బాదరబందీ లేకపోవడంతో క్విక్ కామర్స్ సంస్థలు ఆకర్షణీయమైన ధరకే ఉత్పత్తులను అందిస్తుండటం సైతం కస్టమర్లు వాటివైపు మొగ్గు చూపేందుకు దోహదపడుతోంది. ఈ నేపథ్యంలో నిత్యావసరాల మార్కెట్లో ఆధిపత్యం ఉన్న కిరాణా స్టోర్స్ మనుగడ కోసం పోరాడే పరిస్థితులు నెలకొంటున్నాయి. క్విక్ కామర్స్ వినియోగం 2024-25లో 74% వృద్ధి నమోదు చేయనుంది. 2023–28 మధ్యలో 48% వార్షిక వృద్ధితో అత్యంత వేగంగా ఎదిగిన మాధ్యమంగా నిలవనుందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.విదేశీ పెట్టుబడుల దుర్వినియోగంక్విక్ కామర్స్ వాణిజ్యం పెరగడం స్థానిక రిటైలర్లకు గొడ్డలిపెట్టుగా మారింది. సౌలభ్యం, తక్కువ ధరలకు ఆకర్షితులైన చాలా మంది వినియోగదారులు తమ షాపింగ్ అలవాట్లను మార్చుకుంటున్నారు. ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ మార్పు ఫలితంగా సాంప్రదాయ దుకాణాల్లో అమ్మకాలు తగ్గిపోయాయి. రిటైల్ మార్కెట్‌ను పూర్తి తమ వైపు తిప్పుకోవాలనే ఉద్దేశంతో క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు విదేశీ పెట్టుబడులను దుర్వినియోగం చేస్తున్నాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ఆరోపించింది.ప్రభుత్వ సంస్థల దర్యాప్తుక్వాక్ కామర్స్ కంపెనీలు అనుసరిస్తున్న విధానాలపై ఆందోళనలు ఉన్నాయి. ఈ సంస్థలు పోటీ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయన్న ఆరోపణలపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దర్యాప్తు చేస్తోంది. ఈ ప్లాట్‌ఫామ్‌లు ధరలను కట్టడి చేస్తూ పోటీ చట్టాలను ఉల్లంఘించేలా ఇన్వెంటరీని నియంత్రిస్తున్నాయని సాంప్రదాయ రిటైలర్లు పేర్కొన్నారు. ఈ మేరకు వస్తున్న ఆరోపణలపై సీసీఐ తన దర్యాప్తును కొనసాగించడానికి మరింత వివరణాత్మక సాక్ష్యాలను కోరుతోంది.ఇదీ చదవండి: ఖో-ఖోకు పెరుగుతున్న స్పాన్సర్షిప్ఏం చేయాలంటే..ఈ ఆందోళనలపై స్పందించిన ప్రభుత్వం వాటికి అనుగుణంగా చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. రిటైలర్లకు నష్టం కలగకుండా, క్విక్ కామర్స్ సంస్థలు అంగీకరించేలా సమన్వయం చేస్తూ మార్గదర్శకాలు తయారు చేయాల్సి ఉంది. రిటైల్ వ్యవస్థలో భాగస్వాములందరి ప్రయోజనాలను పరిరక్షిస్తూనే సృజనాత్మకతకు మద్దతు ఇచ్చేలా పరిష్కారాలు కనుగొనాలి. -
స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ సీవోవోగా సాయిరామ్ కృష్ణమూర్తి
క్విక్ కామర్స్ సంస్థ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు కొత్త చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నియమితులయ్యారు. తమసీనియర్ వైస్ ప్రెసిడెంట్, అలాగే చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా సాయిరామ్ కృష్ణమూర్తిని నియమించినట్లు కంపెనీ తెలిపింది.కృష్ణమూర్తి స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ఆపరేటింగ్ యూనిట్లను పర్యవేక్షిస్తారని, ఇందులో డార్క్ స్టోర్ కార్యకలాపాలు, మౌలిక సదుపాయాల కార్యకలాపాలు, నగర వృద్ధి, విస్తరణ వంటివి ఉన్నాయని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఎఫ్ఎంసీజీ, కన్స్యూమర్ టెక్, రిటైల్‌లో సాయిరామ్ కృష్ణమూర్తికి 18 సంవత్సరాల నాయకత్వ అనుభవం ఉంది.సాయిరామ్ కృష్ణమూర్తి గతంలో మోర్ రిటైల్‌లో సూపర్ మార్కెట్ బిజినెస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పనిచేశారు. అక్కడే చీఫ్ మర్చండైజింగ్ ఆఫీసర్‌గానూ వ్యవహరించారు. ఓలా మొబిలిటీలో ఇండియా సప్లై హెడ్‌గా, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్‌లో 14 ఏళ్లు సేల్స్, మార్కెటింగ్, ఇన్నోవేషన్లలో పనిచేశారు.