మహారాష్ట్రలో అకాలీదళ్‌ చీఫ్‌పై దాడి | Akali Dal Chief Sukhbir Singh Badal Attacked In Maharashtra | Sakshi
Sakshi News home page

మహారాష్ట్రలో అకాలీదళ్‌ చీఫ్‌పై దాడి

Aug 13 2026 2:54 PM | Updated on Aug 13 2026 3:17 PM

Akali Dal Chief Sukhbir Singh Badal Attacked In Maharashtra

నాందేడ్‌: మహారాష్ట్రలో అకాలిదళ్ అధినేత, పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. నాందేడ్‌  నగర శివార్లలోని ఓ గురుద్వార దర్శనానికి వచ్చిన సమయంలో దాడి జరిగింది. సుఖ్‌బీర్‌సింగ్‌తో పాటు సెక్యూరిటీ సిబ్బందికీ గాయాలయ్యాయి. నాందేడ్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

దాడి జరిగిన సమయంలో బాదల్ సతీమణి, అకాలిదళ్ ఎంపీ హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ కూడా ఆయనతోనే ఉన్నారు. సుఖ్‌బీర్ సింగ్ అంతకుముందు రోజు తన కుటుంబంతో కలిసి నాందేడ్‌లోని తఖ్త్ శ్రీ హజూర్ సాహిబ్‌ను సందర్శించారు. సుఖ్‌బీర్ బాదల్ చేతికి గాయమైందని, అయితే అది ప్రాణాపాయం లేనిదని అకాలిదళ్ వర్గాలు తెలిపాయి. చేతికి గాయం కావడంతో ఆయన చేతికి వైద్యులు కుట్లు వేశారు.

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement