స్వాతంత్ర్య దినోత్సవం వేళ రూబియో కీలక సందేశం | US Rubio greets India on Independence Day | Sakshi
Sakshi News home page

స్వాతంత్ర్య దినోత్సవం వేళ రూబియో కీలక సందేశం

Aug 15 2026 7:39 AM | Updated on Aug 15 2026 7:46 AM

US Rubio greets India on Independence Day

వాషింగ్టన్‌: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో.. భారత ప్రజలకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భారత్‌-అమెరికా సంబంధాలు ఎన్నడూ లేనంత బలంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఉన్న వ్యక్తిగత స్నేహపూర్వక సంబంధం ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేస్తోందని రూబియో అన్నారు.

అమెరికా తరఫున భారత ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు రూబియో తన ప్రకటనలో పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న స్నేహం, కుటుంబ సంబంధాలే భారత్‌-అమెరికా భాగస్వామ్యానికి బలమైన పునాది అని ఆయన వివరించారు. రక్షణ, ఇంధన భద్రత, కీలక ఖనిజాలు, కృత్రిమ మేధస్సు (AI), అంతరిక్ష రంగం, వాణిజ్యం తదితర కీలక రంగాల్లో ఇరు దేశాల సహకారం కొనసాగుతోందని తెలిపారు. ఈ సహకారం భారత్‌, అమెరికాతో పాటు మొత్తం హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని మరింత సురక్షితంగా, బలంగా, సుసంపన్నంగా మార్చేందుకు దోహదపడుతోందని అన్నారు. భవిష్యత్తులో ఇరు దేశాలు కలిసి నిర్మించబోయే భాగస్వామ్యంపై అమెరికా ఆశాభావంతో ఉందని పేర్కొన్నారు.

అమెరికాలోనూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..
భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికాలోని పలు రాష్ట్రాలు ప్రత్యేక ప్రకటనలు జారీ చేశాయి. ఆగస్టు 15, 2026ను ‘ఇండియా డే’గా గుర్తిస్తూ భారతీయులకు శుభాకాంక్షలు తెలిపాయి. అమెరికాలోని భారతీయ ప్రవాసుల సేవలు, ఆ దేశ అభివృద్ధికి వారు అందిస్తున్న సహకారాన్ని పలువురు అమెరికన్‌ సెనేటర్లు, కాంగ్రెస్‌ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు కొనియాడారు. భారత్‌-అమెరికా మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యంతో పాటు ఇరు దేశాల ప్రజల మధ్య బలపడుతున్న సంబంధాలు కూడా ఈ సందర్భంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement