జకర్తలా: ఇండోనేషియాలో శనివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై దీని తీవ్రత 7.7గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే,యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ వెల్లడించాయి.
ఇండోనేషియాలోని ఫ్లోర్స్ ద్వీపానికి ఉత్తర తీర ప్రాంతంలో, సముద్రంలో తక్కువ లోతులో(10కిలోమీటర్ల) ఈ భూకంపం కేంద్రీకృతమైంది. ఈ భారీ ప్రకంపనల కారణంగా ఫ్లోర్స్ ద్వీపంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో బలమైన కంపనాలు సంభవించాయి.
తూర్పు నుసా టెంగారా, దక్షిణ సులవేసి, పశ్చిమ నుసా టెంగారా, ఆగ్నేయ సులవేసి ప్రాంతాల్లో సునామీ ముప్పు ఉండే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. తీర ప్రాంత ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. ప్రధాన భూకంపం తర్వాత ఆ ప్రాంతంలో పలుమార్లు చిన్నపాటి ప్రకంపనలు(ఆఫ్టర్ షాక్స్) కూడా సంభవించాయి. భూకంపం కారణంగా చోటు చేసుకున్న ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది

🚨 The earthquake in Indonesia was magnitude 7.7. For many people, the early morning began with disaster. 🇮🇩#Indonesia #Earthquake #BreakingNews #EarthquakeAlert pic.twitter.com/c4edaQnCEh
— Mahrosh Pervaiz (@MahroshPervaiz1) August 15, 2026
❗️💥 Three more tremors hit Indonesia 🇮🇩
Following the 7.7-magnitude earthquake, three aftershocks of 5.9, 5.6 and 6.1 were recorded in the region.#Indonesia #Earthquake #Aftershocks #Tsunami #BreakingNews pic.twitter.com/sIrP1iPXKj— Mahrosh Pervaiz (@MahroshPervaiz1) August 14, 2026


