AP: రానున్న మూడుగంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు | Rain warnings for Andhra Pradesh in the next three hours | Sakshi
Sakshi News home page

AP: రానున్న మూడుగంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు

Aug 10 2026 4:50 PM | Updated on Aug 10 2026 4:54 PM

Rain warnings for Andhra Pradesh in the next three hours

సాక్షి, అమరావతి:  వాతావరణ శాఖ రాష్ట్రానికి వర్ష హెచ్చరికలు జారీ చేసింది. రానున్న మూడుగంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం, మన్యం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. 

అదేవిధంగా  విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని చెట్లకింద, హోర్డింగుల వద్ద నిల్చోవద్దని  వాతావరణ శాఖ సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement