తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ నిరసన ర్యాలీలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తాజాగా డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త నిరసన ర్యాలీలు విజయవంతం కావడంతో సజ్జల మీడియాతో మాట్లాడారు. తాము అడిగిన దాంట్లో వాస్తవం లేకపోతే ప్రజల నుంచి ఇంత స్పందన ఎలా వస్తుందని ప్రశ్నించారు.
‘వైఎస్సార్‌సీపీ నిరసన ర్యాలీలకు ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. డీఎస్సీ అక్రమాలపై కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు. నిరసనలపై కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మా పోరాటాలను అణచివేయాలని చూస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ర్యాలీలు విజయవంతమయ్యాయి.
వైఎస్సార్‌సీపీ చేపట్టిన ప్రతి కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. నిరసన కార్యక్రమాలను ఓ ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తున్నాం. అందుకే వైఎస్సార్‌సీపీ పోరాటాను అణగదొక్కాలనే ప్రయత్నం చేస్తున్నారు. డీఎస్సీలో అక్రమాలు జరిగింది వాస్తవం కాబట్టే చంద్రబాబు ఉలిక్కిపడుతున్నారు. ఈ స్కాం నుంచి చంద్రబాబు, లోకేష్ తప్పించుకోలేరు. డీఎస్సీ అక్రమాలపై కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు. నిరసనలపై కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇప్పటివరకూ ఇవ్వలేదు. మేం అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతోంది. డీఎస్సీలో అక్రమాలు జరిగినట్లు క్లియర్‌గా తెలుస్తోంది. ఉన్నతస్థాయిలోనే తప్పు జరిగిందనే విషయం అర్థమవుతోంది. అక్రమాలు జరిగాయి కాబట్టే సీబీఐ విచారణకు భయపడుతున్నారు. లీకేజీ జరిగిందనడానికి తిరుగులేని ఆధారాలున్నాయి
ఒక తప్పును కవర్ చేయడానికి తప్పుల మీద తప్పులు చేశారు. అక్రమాలు బయటకు రావడంతో సర్టిఫికెట్లు కూడా టాంపర్ చేసి మార్చారు’ అని ధ్వజమెత్తారు సజ్జల.


