33 ఏళ్ల సుదీర్ఘ సేవలు : ప్రొఫెసర్‌కు సర్‌ప్రైజ్‌ ఎమోషనల్‌ వీడియో | Students Give Emotional Farewell To Professor After 33 Years Of His Academic Service | Sakshi
Sakshi News home page

33 ఏళ్ల సుదీర్ఘ సేవలు : ప్రొఫెసర్‌కు సర్‌ప్రైజ్‌ ఎమోషనల్‌ వీడియో

Aug 15 2026 12:56 PM | Updated on Aug 15 2026 1:16 PM

Students Give Emotional Farewell To Professor After 33 Years Of His Academic Service

పిల్లలకు తల్లిదండ్రుల తరువాత ఆప్తులు ఎవరు అనగానే ముందుగా గుర్తొచ్చేది ఉపాధ్యాయులే అని కచ్చితంగా చెప్పవచ్చు. పాఠాలు నేర్పిన గురువులను అనుకరిస్తూ బాల్యంలో బెత్తం పట్టుకుని టీచర్‌ వేషం వేసిన వాళ్లమే అందరమూ. మనుషులుగా ఎదగడంలో, పరిణతి చెందడంలో గురువుల ప్రాధాన్యత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ.

తాజాగా గురు శిష్యుల అనుబంధానికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 33 ఏళ్లపాటు సేవలందించి, పదవీ విమరణచేసిన ఒక ప్రొఫెసర్‌కు విద్యార్థులు భావోద్వేగ వీడ్కోలు పలికారు. XLRI జంషెడ్‌పూర్‌లో సుదీర్ఘ అకాడమిక్ ప్రస్థానం ముగిసిన సందర్భంగా ప్రొఫెసర్ వేణుగోపాల్ పింగళికి వీడ్కోలు పలుకుతూ విద్యార్థులు,అధ్యాపకులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. 

ఆయన వద్ద పాఠాలు నేర్చుకున్న ప్రొఫెసర్ మనీష్ సింఘాల్ ఈ విషయాన్ని సోషల్ మీడియా పోస్ట్ ద్వారా పంచుకున్నారు. పదవీ విరమణ రోజు ప్రొఫెసర్ పింగళి చివరి క్లాస్ ముగించుకొని వచ్చీ రావడంతోనే సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థులు తరగతి గది వెలుపల పెద్ద ఎత్తున గుమిగూడి తమ అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకున్నారు. ఇది చూసిన ఆయన కూడా ఆశ్యర్యానికి గురైనారు. విద్యార్థులతో  పాటు  ప్రొఫెసర్‌కూడా ఎమోషనల్‌ అయ్యారు. 

ఇదీ చదవండి: 12 సీట్లతో మొదలై రెండేళ్లలోనే రూ. 350 కోట్ల బిజినెస్‌

 

ప్రొఫెసర్ పింగళితో తన సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, ప్రొఫెసర్ మనీష్ సింఘాల్ ఈ భావోద్వేగ క్షణాన్ని తన పోస్ట్‌లో పంచుకున్నారు. 2006 ఏప్రిల్ 13న సింఘాల్ XLRIలో చేరినప్పుడు పింగళి డీన్ (అకాడమిక్స్)గా ఉన్నారు. సింఘాల్ థీసిస్ పూర్తి చేయడానికి ఐఐఎమ్ కలకత్తా వెళ్లేందుకు లీవ్‌ల విషయంలో ప్రొఫెసర్ పింగళి ఎంతో మద్దతుగా నిలిచారని మనీష్ సింఘాల్ తెలిపారు.  విద్యార్థుల వ్యక్తిగత పరిస్థితులను అర్థం చేసుకుంటూ పరిపాలనా నిర్ణయాలు తీసుకోవడం ఆయన ప్రత్యేకత అని కొనియాడారు.భారతీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ప్రొఫెసర్ పింగళి రూపొందించిన ఫ్రేమ్‌వర్క్‌లు తరాల తరబడి ఎంబీఏ (MBA) విద్యార్థులకు మార్కెటింగ్‌పై అవగాహన పెంచాయని ఆయన రాసుకొచ్చారు.

ఇదీ చదవండి: బ్లింకిట్‌, జెప్టో, ఇన్‌స్టామార్ట్‌ కాదు : బొద్దింకలు, ఎలుకలు, బల్లుల కేంద్రాలు

సోషల్ మీడియా స్పందన
ఈ వీడియో నెటిజన్లు అద్భుతం అంటూ ప్రశంసలు కురిపించారు. నిజంగా అపూర్వమైన క్షణాలు.  దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఆయన వద్ద చదువుకునే భాగ్యం లభించిందని ఆయన విద్యార్థులు,  ఆయన నిజంగా ఒక లెజెండ్ అంటూ  ఇతరులు స్పందించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement