విజయవాడ :ఇంద్రకీలాద్రిపై శ్రావణ మాసం తొలి శుక్రవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు దుర్గమ్మను దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు.
అమ్మవారికి నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు.
తెల్లవారుజామున ఆరు గంటల నుంచే అన్ని క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి.
మధ్యాహ్నం మహా నివేదన అనంతరం భక్తుల రద్దీ మరింత పెరగడంతో అంతరాలయ దర్శనాన్ని రద్దు చేసి బంగారు వాకిలి ద్వారా దర్శనం కల్పించారు.


