ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో దారుణం చోటు చేసుకుంది. భార్యపై అనుమానం, ఆడపిల్ల పుట్టిందనే కారణంతో సికంద్రా సమీపంలోరింకూ అనే వ్యక్తి తన 11నెలల కుమార్తెను యమునా నదిలో విసిరేసి హత్య చేశాడు. సరిగ్గా ఆమె పుట్టిన రోజుకు మూడు రోజులు ముందు ఇంత అమానుషానికి పాల్పడ్డాడు.
ఆగస్టు 17న కుమార్తె బర్త్ డే ఉండటంతో, బట్టలు కొనేందుకు బైక్‌పై భార్య, పాపతో కలిసి ఆగ్రాకు బయల్దేరాడు. ముందుగానే పథకం వేసుకున్నాడో, ఏమో తెలియదుగానీ దారిలో, అక్బరీ బ్రిడ్జ్ దగ్గర బండి ఆపాడు. సెల్ఫీ తీసుకుందామని చెప్పి భార్య లక్ష్మిని నమ్మించాడు. అకస్మాత్తుగా పాపను తల్లి ఒడిలోంచి లాక్కొని మరీ సెల్ఫీ తీస్తున్నట్టుగా నటించి, యమునా నదిలోకి విసిరేశాడు. దీంతో హతాశురాలైన ఆమె, ఎందుకిలా చేశావని ప్రశ్నింస్తుండగానే ఆమెను కూడా నదిలోకి నెట్టేందుకు ప్రయత్నించాడు. అయితే ఆమె గట్టిగా అరిచి కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని ఆమెను రక్షించారు. రింకూని చితకబాది పోలీసులకు అప్పగించారు.
In Agra, Uttar Pradesh, a man identified as Rinku threw his 11-month-old daughter into the Yamuna River. He was about to throw his wife in as well when onlookers confronted him and rescued her. Efforts are being made to rescue the body of the infant. https://t.co/b5RxupqjU1
— Piyush Rai (@Benarasiyaa) August 14, 2026
ఇదీ చదవండి: 33 ఏళ్ల సుదీర్ఘ సేవలు : ప్రొఫెసర్‌కు సర్‌ప్రైజ్ ఎమోషనల్ వీడియో
ఇదీ చదవండి: బ్లింకిట్, జెప్టో, ఇన్‌స్టామార్ట్ కాదు : బొద్దింకలు, ఎలుకలు, బల్లుల కేంద్రాలు
సంఘటన గురించి తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడైన రింకును అదుపులోకి తీసుకున్నారు. పాప ఆచూకీ కోసం గజ ఈతగాళ్లను పిలిపించారు, కానీ ఎలాంటి ఆచూకీ లభించలేదు. నిందితుడు రింకుపై హత్య కేసు నమోదు చేసినట్లు డీసీపీ సిటీ సయ్యద్ అలీ అబ్బాస్ తెలిపారు. పాపను గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
రెండున్నరేళ్ల క్రితం వివాహం జరిగిందని భార్య లక్ష్మి పోలీసులకు తెలిపింది. భర్తకు తనపై అనుమానంతో తరచూ గొడవపడేవాడని, దీంతో తాను ఆరు నెలల పాటు తన పుట్టింట్లో ఉండిపోయానని చెప్పింది. కూతురి విషయంలో తరచూ తనతో గొడవపడేవాడని లక్ష్మి వాపోయింది. అయితే ఈ మధ్య కాలంలో చిన్నారిపై ప్రేమానురాగాలుచూపుతున్నట్లు నటిస్తూనే ఈ దురాగతానికి పాల్పడ్డాడని ఆమె కన్నీరు పెట్టుకుంది.
ఇదీ చదవండి: రూ. 11.5 కోట్ల ఆస్తి, 38 ఏళ్లకే రిటైర్‌మెంట్ ప్లాన్సా? నెట్టింట ఒకటే చర్చ


