సినిమా ఇండస్ట్రీలోకి సినీ స్టార్స్ ఫ్యామిలీ నుంచి చాలామంది ఎంట్రీ ఇవ్వడం మనం చూస్తుంటాం. మన పిల్లలు కూడా తల్లిదండ్రులను ఫాలో అవుతుంటారు. ముఖ్యంగా సినిమాల్లోకి వచ్చేవారు దాదాపు సినీ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచే వస్తుంటారు. అది మన టాలీవుడ్‌లో కాస్తా ఎక్కువగానే ఉంటుంది.
కానీ అందుకు భిన్నంగా ఓ షాకింగ్ డెసిషన్ తీసుకుంది స్టార్ నటుడి కుమార్తె. ఆమె మరెవరో కాదు.. రేసుగుర్రంలో విలన్‌గా మెప్పించిన రవికిషన్ కూతురు. బాలీవుడ్ నటుడు రవి కిషన్ కుమార్తె ఇషితా శుక్లా ఇండస్ట్రీని కాదని విభిన్నమైన కెరీర్ ఎంచుకుంది. అగ్నివీర్‌గా రక్షణ దళంలో చేరారు. తండ్రిలా కాకుండా డిఫరెంట్ కెరీర్‌ను ఎంచుకుంది.
రవి కిషన్ కుమార్తె అయిన ఇషితా శుక్లాకు చిన్న వయసులోనే ఆర్మీలో పని చేయాలన్న ఆసక్తి పెరిగింది. బాలీవుడ్‌కు వెళ్లకుండా.. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ)లో చేరారు. ఆ తర్వాత సైనిక శిక్షణ పొంది రక్షణ రంగంలో పనిచేసేందుకు సిద్ధమైంది. ఇషిత ఢిల్లీ డైరెక్టరేట్‌కు చెందిన 7 గర్ల్స్ బెటాలియన్‌లో పనిచేశారు. కర్తవ్య పథ్‌లో గణతంత్ర దినోత్సవ పరేడ్ కోసం కూడా శిక్షణ తీసుకున్నారు. కాగా.. ఇషిత శుక్లా 2023లో అగ్నివీర్‌గా చేరినట్లు తెలుస్తోంది. దీంతో దేశానికి సేవ చేయాలన్న ఇషిత నిర్ణయాన్ని అనుపమ్ ఖేర్‌తో సహా పలువురు ప్రముఖులు ప్రశంసించారు.


